అగ్నిధారన్యూస్, జూలపల్లి:జూలపల్లి మండల కేంద్రంలోని అబ్బాపూర్ గ్రామానికి చెందిన చొప్పరి నర్సింగం గురువారం సాయంత్రం తన ఇంటి ఇంటి వద్ద గల రేకుల షెడ్డు లోని ఎరువుల బస్తాలు తీస్తుండగా ప్రమాదశాత్తు అతని కుడి కాలికి అకస్మాత్తుగా పాము కాటు వేయడంతో చికిత్స నిమిత్తం కరీంనగర్ లోని ప్రభుత్వ ఆసుపత్రికి హుటా హుటిన తరలించారు.చికిత్స పొందుతూ గురువారం రాత్రి మరణించినట్లు ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు దృవీకరించారు. మృతుడి భార్య చొప్పరి పద్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు జూలపల్లి ఎస్ ఐ వెంకటకృష్ణ తెలిపారు.
