పెద్దపల్లి నియోజకవర్గంలో భారీగా చేరికలు.
సర్పంచులు మాజీ సర్పంచులు బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా.
రేవంత్ రెడ్డి సమక్షంలో కండువా కప్పుకున్న నాయకులు ప్రజా ప్రతినిధులు.
అగ్నిధారన్యూస్, పెద్దపల్లి//సుల్తానాబాద్//జూలపల్లి:పెద్దపల్లి జిల్లా పెద్దపల్లి నియోజకవర్గంలో రాజకీయ సమీకరణ రోజు రోజుకి శరవేగంగా మారుతున్నాయి. నిన్న మొన్నటి వరకు బీఆర్ఎస్ పార్టీలో స్తబ్దంగా ఉన్న నాయకులు,ప్రజా ప్రతినిధులు ఒక్కసారిగా ఎవరి దారివారు చూసుకుంటున్నారు.మారుతున్న రాజకీయ పరిణామాలతో, పెద్దపల్లి నియోజకవర్గంలోని బిఆర్ఎస్ పార్టీకి చెందిన కొన్ని గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, కుల సంఘాల నాయకులు స్థానిక ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి విధివిధానాలు నచ్చకపోవడంతో మాజీ ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు తోపాటు, టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సమక్షంలో పలువురు హైదరాబాదులో కాంగ్రెస్ తీర్థంపుచ్చుకుంటున్నారు. ఆదివారం రోజు నియోజకవర్గంలోని ముఖ్య నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీలో చేరిన వారిలో.సందవేని సునీత రాజేందర్, పెద్దపల్లి మాజీ ఎంపీపీ, తమ్మడ బోయిన ఓదెలు యాదవ్, ఉమ్మడి జిల్లా గొర్రెల పెంపకం దార్ల సహకార యూనియన్, అధ్యక్షులు,దారవెని నర్సింహ యాదవ్ జూలపల్లి సర్పంచ్, జూలపల్లి మండల సర్పంచుల ఫోరం అధ్యక్షులు,ఎలగందుల శంకరయ్య మూలసాల గ్రామ సర్పంచ్, పెద్దపల్లి మండల సర్పంచుల ఫోరం అధ్యక్షులు,ఆడేపు వెంకటేశం రాఘవపూర్ గ్రామ సర్పంచ్,మేకల మల్లేశం యాదవ్ బోజన్నపేట గ్రామ సర్పంచ్,పెరక రిషిత రాజేందర్ నిమ్మనపల్లి గ్రామ సర్పంచ్,తోట శ్రీనివాస్ రాఘవపూర్ గ్రామ ఎంపీటీసీ,కుంట రేవతి లింగమూర్తి రాఘవపూర్ గ్రామ ఉపసర్పంచ్,అడువాల తిరుపతి బాలరాజుపల్లి గ్రామ ఉపసర్పంచ్,కొట్టే రాజన్న వడ్కాపూర్ గ్రామ మాజీ ఎంపీటీసీ,ఎలబోతారం భాగ్యలక్ష్మి శంకర్ కొత్తపల్లి మాజీ సర్పంచ్,కొమ్ము సంపత్ యాదవ్ సుద్దాల మాజీ సర్పంచ్,గుర్రాల వీరేశం బోంపల్లి గ్రామ మాజీ ఎంపీటీసీ ఎలిచాల, జ్యోతి ఆజనేయులు రాఘవపూర్ గ్రామ వార్డు సభ్యులు,తాడిషెట్టి కవిత దేవేందర్ వార్డు సభ్యులు,అడప శంకరమ్మ దామోదర్,వార్డు సభ్యులు,కుమ్మరి లక్ష్మి తిరుమల్ వార్డు సభ్యులు,కలవెని సతీష్ వార్డు సభ్యులు,గుండ కుమార్ రాఘవపూర్ గ్రామ వార్డు సభ్యులు,ఆకుల సంపత్ కాపు సంఘం అధ్యక్షులు,కొమ్ము వినోద్,చాటకోళ్ల సతీష్,అర్కుటి సతీష్, కొల్ల అశోక్,కొండ సుధాకర్ తాపీ సంఘం జిల్లా అధ్యక్షులు,కల్వల రామస్వామి బీజేపీ సీనియర్ నాయకులు,సిలుముల సంజీవ్, బుదారపు అభిలాష్ బీజేపీ సీనియర్ నాయకులు,కొండపత్రి మధుకొలిపాక శ్రీనాథ్, కాంగ్రెస్ పార్టీలో చేరారు. పార్టీలో చేరిన వారందరికీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి విజయ రమణారావు గెలుపు కోసం ప్రతీ ఒక్కరూ, ఒక్కో సైనికుడిలా పని చేయాలని రేవంత్ రెడ్డి సూచించారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రతినిదులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీలో చేరిన వారందరూ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డికి ముఖ్య అనుచరులు కావడం విశేషం.రాబోయే రోజుల్లో నియోజకవర్గంలో మరిన్ని అన్ని పార్టీలలో మరిన్ని రాజకీయ పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి.


