అగ్నిధార న్యూస్ సుల్తానాబాద్

సుల్తానాబాద్ పట్టణంలోని బస్టాండ్ లో రెండు ఆర్టీసీ బస్సులు  ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ప్రాణాపాయం తప్పడంతో పలువురు ప్రయాణికులు ఊపిరి  పీల్చుకున్నారు. వివరాల్లోకి వెళితే బస్టాండ్ లో ఆగి ఉన్న మంథని డిపోకు చెందిన బస్సును ఆగి ప్రయాణికులను ఎక్కించుకునే సమయంలో వెనుక నుండి గోదావరిఖని డిపోకు చెందిన బస్సు ఢీకొనడంతో పలువురు ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. తీవ్రంగా గాయపడిన కొంతమందిని హుటా హుటిన కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సుల్తానాబాద్ ఎస్సై విజేందర్  తెలిపారు.