అగ్నిధార (రామగిరి మండలం) రామగిరి మండలం సింగరేణి అర్జీ త్రీ ఏరియా మరియు ఏ ఎల్ పి తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం బ్రాంచ్ కార్యదర్శి పదవికి రాజీనామా చేస్తున్నట్లు జక్కుల దామోదర్ రావు తెలిపారు. గత నెలలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీబీజీకేఎస్ అనుబంధ సంస్థ అయిన బిఆర్ఎస్ అభ్యర్థులు కోల్ బెల్ట్ ప్రాంతంలో ఒక్క అభ్యర్థి కూడా విజయం సాధించకపోవడంతో తీవ్ర మనస్తాపంతో రాజీనామా చేస్తున్నట్టు తెలిపారు. కావున ఈ యూనియన్ లో కొనసాగలేనని భావించి ఇందుకు నేను నైతిక బాధ్యతగా నా ప్రస్తుత పదవి బ్రాంచ్ సెక్రటరీ ఆర్ జి త్రీ  ఏ ఎల్ పి కి రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు ఈ సందర్భంగా ఇన్ని రోజులు కుటుంబ సభ్యుడిగా భావించి ఆదరించి నందుకు కృతజ్ఞతలు తెలుపుతూ మరియు ఆర్ జి త్రీ ఏ ఎల్ పి యాజమాన్యం నన్ను గౌరవించిన నా విన్నపాన్ని పరిశీలించి నందుకు కృతజ్ఞతలు తెలిపారు. నా రాజీనామాను టీబిజీకేస్ యూనియన్ నాయకులు ఆమోదించాలని కోరారు.