అగ్నిధారన్యూస్, ( వనపర్తి జిల్లా )వనపర్తి జిల్లా కేంద్రంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో వైకుంఠ ఏకాదశి నీ పురస్కరించుకొని తెల్లవారుజామున వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి కుటుంబ సమేతంగా ఉత్తర ద్వార దర్శనం చేసుకున్నారు.ఈ సందర్భంగా ఆయన సతీమణి శారదా రెడ్డి లు ఉత్తర ద్వారానికి ప్రత్యేక పూజలు చేశారు.అనంతరం ఉత్తర ద్వారా ప్రవేశం చేసిన ఎమ్మెల్యే ఆలయంలోని స్వామి వారిని దర్శనం చేసుకున్నారు.ప్రత్యేక ఆసనం పై కొలువైన వెంకటేశ్వర స్వామికి ఎమ్మెల్యే దంపతులు ప్రత్యేక పూజలు చేశారు.వేద పండితులు వేదమంత్రాలతో ఆశీర్వచనం అనంతరం తీర్థప్రసాదాలు స్వీకరించి పట్టణ వాసులకు వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చీర్ల చందర్, కౌన్సిలర్లు బ్రహ్మం, సుజాత మధు, చీర్ల సత్యం, విభూది నారాయణ, కాంగ్రెస్ నాయకులు గొల్ల వెంకటయ్య, లక్కాకుల సతీష్ పట్టణ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
