అగ్నిధారన్యూస్, చెన్నూర్: మంచిర్యాలలోని మాజీ ఎంపీ, చెన్నూర్ కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వివేక్ వెంకటస్వామి నివాసంలో ఐటీ సోదాలు కలకలం రేపాయి. మంగళవారం ఉదయం 5 గంటలకు ఐటీ అధికారులు వివేక్ నివాసం వద్దకు చేరుకొని తనిఖీలు చేపట్టారు. గత కొన్ని రోజుల నుండి వివేక్‌కు చెందిన కంపనీల డబ్బును చెన్నూర్ నియోజక వర్గంలో ఓటర్లను కొనేందుకు తరలిస్తున్నారు అని ఆరోపణలు రాగా ఈ రోజు వివేక్ ఇంట్లో ఐటీ సోదాలు దాడులు నిర్వహిస్తోంది. ఇటీవల వివేక్‌కు చెందిన రూ. 8 కోట్ల డబ్బును పోలీసులు ఫ్రీజ్ చేశారు. గతంలో రూ.50 లక్షలతో వివేక్ కంపెనీ ఉద్యోగులు పట్టుబడిన విషయం తెలిసిందే. వివేక్, వినోద్ ఇళ్లతో పాటు ఆయన కూతురు ఇంట్లోను ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. హైదరాబాద్, చెన్నూరులో ఏకకాలంలో ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారు. నాయకులు, అనుచరులు వివేక్ ఇంటికి చేరుకొని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేస్తున్నారు.