ముత్తారంలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన ఏఐసీసీ సెక్రెటరీ – ఎమ్మెల్యే శ్రీధర్ బాబు.
అగ్నిధారన్యూస్ మంథని :
ముత్తారం మండలం రామకృష్టాపూర్ గ్రామంలో 6 గ్యారంటీల గురించి వివరిస్తూ ఏఐసీసీ కార్యదర్శి, మాజీ మంత్రి, మేనిఫెస్టో కమిటీ చైర్మన్, మంథని ఎమ్మెల్యే దుద్దిళ్ళ శ్రీధర్ బాబు సోనియా గాంధీ ప్రకటించిన ఆరు గ్యారెంటీలను ప్రచారం చేయడం జరిగింది.దుద్దిళ్ళ శ్రీధర్ బాబు గ్యారంటీ కార్డులను ప్రజలకు వివరించి పంపిణీ చేశారు.తెలంగాణ బడుగు, బలహీన వర్గాల ప్రజల అభివృద్ధి ,రాష్ట్రంలోని పేద ప్రజలకు అండగా కాంగ్రెస్ పార్టీ ఉంటుందని, ఇచ్చిన మాట ప్రకారం తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిందని రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే వంద రోజుల్లో గ్యారెంటీ కార్డులో చెప్పిన ప్రకారంగా హామీలు అన్ని కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తుందని తెలిపారు. గ్యారెంటీ కార్డులోని హామీలు ఈ విధంగా వివరిస్తూ…
1.మహాలక్ష్మి పథకం : ప్రతి మహిళకు ప్రతి నెల రూపాయలు 2500, లు 500 కి గ్యాస్ సిలిండర్ ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం
2.రైతు భరోసా పథకం : ఈ పథకం కింద ప్రతి రూ.15000 లు రూ 12000, లు కౌలు రైతులకు వ్యవసాయ కూలీలకు వరి పంటకు రూపాయల 500 బోనస్.
3.గృహ జ్యోతి పథకం : ప్రతి ఇంటికి అవసరాలకు 200 యూనిట్లు ఉచిత విద్యుత్,
4.ఇందిరమ్మ ఇంటి పథకం :
ఇంటి స్థలం, గృహ నిర్మాణానికి 5 లక్షలు అందించనున్నారు.
5.యువ వికాస పథకం : ప్రతి విద్యార్థికి ఐదు లక్షల విద్యా భరోసా కార్డు..
6.చేయూత పింఛన్ : ఆసరా పెన్షన్ 4,000/- రూపాయలకు పెంపు కల్పించనుందని తెలిపడం జరిగింది.ఈ కార్యక్రమంలోముత్తారం మండల కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు,మహిళాలు కార్యకర్తలు, రామకృష్టాపూర్ గ్రామ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

