కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలను పరిష్కరిస్తా నిరుద్యోగ సమస్య లేకుండా చేస్తా.
సింగరేణి కార్మికుల సమస్యలను అసెంబ్లీలో మాట్లాడతా.
రామగుండం బిజెపి ఎమ్మెల్యే అభ్యర్థి కందుల సంధ్యారాణి.
అగ్నిధారన్యూస్(రామగిరి మండలం) రామగిరి మండలం అడ్రియాల లాంగ్ వాల్ ప్రాజెక్ట్ లో గని కార్మికులను కలిసి ఎమ్మెల్యే అభ్యర్థిగా గెలిపించాలని గని కార్మికులను కందుల సంధ్యారాణి కోరడం జరిగింది.నేను ఒక సింగరేణి కార్మికురాలు బిడ్డని నాకు అన్న తమ్ముళ్లు ఎవరు లేరు. సింగరేణి కార్మికులే నాకు అన్న తమ్ముళ్లు అని అన్నారు..
రామగుండం నియోజకవర్గం లో ఎప్పుడు కూడా ప్రజలు వినూత్న తీర్పు ఇస్తున్నారు. రామగుండం ప్రజలు కష్టపడ్డ వారికి పట్టం కడతారని తెలంగాణ ఉద్యమంలో అనేకంగా కష్టపడ్డ నాకు టికెట్ ఇవ్వకుండా బీఆర్ఎస్ పార్టీ అవమాన పరిచిందని..బిజెపి పార్టీ అక్కున చేర్చుకుందని తనను గుర్తించి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చిందని అన్నారు.రామగుండం ఆడబిడ్డగా నాకు ఓటేసి గెలిపించాలని 30 సంవత్సరాల రాజకీయ జీవితంలో ఒక పైసా కూడా అవినీతి చేయకుండా ఓటమి ఎరగని నాయకురాలినని ఎప్పుడు ప్రజా సమస్యలు పరిష్కరించడంలో ముందుంటానని అన్నారు.ఈ కార్యక్రమంలో బి.ఎం.ఎస్ రాష్ట్ర అధ్యక్షుడు యాదగిరి సత్తయ్య, అర్జీ త్రీ ఉపాధ్యక్షుడు అరకాల ప్రసాద్,రామగిరి మండల ఇంచార్జ్ మోలుమూరి శ్రీనివాస్, మామిడి స్వామి,సురేష్,రాజు, మంథని ఐటి సెల్ కన్వీనర్ తోట్ల రాజు,సీనియర్ నాయకులు యాట బుమేష్, రేణుకుంట్ల విజయ్ తదితరులు పాలుగోన్నారు.
