నామినేషన్ ఉపసంహరించుకున్న నల్ల మనోహర్ రెడ్డి.
అగ్నిధార న్యూస్, పెద్దపల్లి//సుల్తానాబాద్:
ఇటీవల చోటు చేసుకున్న రాజకీయంగా పరిణామాలతో పెద్దపల్లి నియోజకవర్గంలో రోజురోజుకు పరిస్థితులు మారుతున్నాయి. ఇంతకాలం బి ఆర్ ఎస్ కు తలనొప్పిగా మారిన రెబల్ అభ్యర్థి నల్ల మనోహర్ రెడ్డి ఇండిపెండెంట్ అభ్యర్థిగా ఇటీవల నామినేషన్ వేశారు. ఈరోజు నామినేషన్ ఉపసంహరణకు చివరి రోజు కాగ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నుండి నల్ల మనోహర్ రెడ్డికి ఫోన్ రావడంతో సోషల్ వర్కర్ కోటాలో ఎమ్మెల్సీ పదవి ఇస్తానని హామీ ఇవ్వడంతో తన నామినేషన్ ఉపసంహరించుకున్నట్లు తెలిసింది. మరికొద్ది సేపట్లో బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో తన అనుచరులతో బిఆర్ఎస్ తీర్థం పుచ్చుకోనున్నట్లు ఆయన తెలిపారు.
