ప్రజలంతా సు:ఖసంతోషాలతో ఉండాలి.
నియోజకవర్గ ప్రజలకు భోగి సంక్రాంతి శుభాకాంక్షలు.
భోగి సంబరాల్లో పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణరావు
అగ్నిధారన్యూస్ సుల్తానాబాద్//సుల్తానాబాద్ రూరల్
సంక్రాతి పండగను పురస్కరించుకొని, ఆదివారం రోజు సుల్తానాబాద్ పట్టణంలోని గాంధీనగర్ లో తెల్లవారు జామున భోగి పండగ వేడుకల్లో..
పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విజయ రమణారావు…
భోగి మంటలను వెలిగించి భోగి సంబరాలను ప్రారంభించి, అనంతరం తెలంగాణ రాష్ట్ర ప్రజలకు పెద్దపల్లి నియోజకవర్గ ప్రజలందరికి సంక్రాతి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ… సుల్తానాబాద్ పట్టణంలోని గాంధీనగర్లో గత 13 సంవత్సరాల నుండి భోగి పండగ వేడుకలను హరిదాసుల కీర్తనలు గంగిరెద్దుల విన్యాసాలు చిన్నారుల కోలాటాల మధ్యలో అంగరంగ వైభవంగా వేడుకలు నిర్వహించడం చాలా సంతోషంగా ఉంది అన్నారు. అలాగే సంక్రాంతి పండుగ అంటే సిరులు తెచ్చే పండుగ అని అన్నారు. ఈ సందర్భంగా గాంధీ నగర్ కాలనీ వాసులను ప్రత్యేకంగా అభినందించారు. ఈ సంక్రాంతి పండుగ ఇంటిల్లిపాదికి ఆనందాన్నిచ్చే పండుగ ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో రైతు కుటుంబాల్లో అత్యంత ఆనందంగా జరుపుకునే పండుగ అన్నారు. భోగ బాగ్యాలు తెచ్చే పండుగ భోగి పండుగ అని ప్రజలంతా సు:ఖ సంతోషాలతో ఉంటారని పాత వస్తులు అన్ని అగ్నికి ఆహుతిచేసి జీవితాలలో సు:ఖసంతోషాలు ఉండాలని భోగి మంటలు వేసుకుంటారు ప్రజలకు శోభను ఇచ్చే పండగ భోగి అన్నారు. చిన్నపిల్లలు అందరికి ఇంద్రధనస్సుల,రంగవల్లులు వేసుకుంటారని అన్నారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే తనయుడు గోపికృష్ణ తోపాటు, కాంగ్రెస్ నాయకులు అంతటి అన్న గౌడ్, ప్రకాష్ రావు, కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రతినిధులు, నాయకులు, కాలనీ వాసులు,యూత్ సభ్యులు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.


