అగ్నిధారన్యూస్, సుల్తానాబాద్:
సుల్తానాబాద్ మండల కేంద్రంలోని సుద్దాల గ్రామ శివారులో గల సాంబశివ ఇండస్ట్రీస్ c/o సాయి వెంకటేశ్వర రైస్ మిల్లు నుండి వెలబడుతున్న వ్యర్థ పదార్థాలు తమ తమ పొలాల్లోకి వస్తున్నాయని రైస్ మిల్లు యాజమాన్యానికి తెలిపినప్పటికీ వారు ఏ మాత్రం పట్టించుకోకపోవడంతో వారి వరి పంటలు నాశనం అవుతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో చేసేది ఏమీ లేక గత నెలరామగుండం పొల్యూషన్ కంట్రోల్ అధికారులకు, హైదరాబాద్ క్షేత్రియ కార్యాలయం పొల్యూషన్ కంట్రోల్ అధికారులకు రైతులు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుతో పరిశీలనకు వచ్చిన అధికారులు విద్యుత్ శాఖకు సిఫార్సు చేసి, నోటీసులు జారీ చేయడంతో పాటు ఈ రైస్ మిల్లును సీజ్ చేయడం జరిగిందనీ అధికారులు తెలిపారు. ఇప్పటికైనా తమ సమస్యను పట్టించుకోన్న అధికారులకు స్థానిక రైతులు కృతజ్ఞతలు తెలిపారు.
