గాడితప్పిన పాలన గత్యంతరంలేక జనాలయాతన.
అగ్నిధారన్యూస్, వనపర్తిజిల్లా:
వనపర్తి జిల్లా కేంద్రంలోని పాలిటెక్నిక్ కళాశాల మైదానo పట్టణంలోని అన్ని కాలనీలకు సమదూరంలో ఉండడం చేత , ఉదయం నుంచి సాయంత్రం వరకు, చిన్నపిల్లలు వృద్ధులు మహిళలు, విద్యార్థులు, ప్రొఫెసర్సు, జిల్లాస్థాయి అధికారులు, ఈ మైదానంలో, వాకింగ్ జాగింగ్ చేస్తుంటారు, ఈ మైదానంలో, పెద్ద పెద్ద వృక్షాలు ఉండడంచేత, అలసిపోయిన బాటసారులు సహితం సేదతీర్చుకోవడానికి వస్తుంటారు.అట్లాంటి మైదానంలో, పండగలు, సెలవు దినాలు వస్తే చాలు, వివిధ ఆర్గనైజేషన్స్, వివిధ రాజకీయ పార్టీలు పోటిపడి, తమ సభలు సమావేశాలకు, విచ్చలవిడిగాయి మైదానాన్ని వాడుకుంటారు. మరి వీరికి పర్మిషన్ ఇచ్చిన అధికారులు, మైదానంలో సరైన సౌకర్యాలు కల్పించడంలో విఫలమవుతున్నారు, కనీసం చిత్తా డబ్బులు ఏర్పాటు చేసే ఇంకిత జ్ఞానం లేకుండా, ఉండడం ఒక ఎత్తైతే, సామాజిక స్పృహ లేకుండా, విచ్చలవిడిగా దీన్లో వినియోగదారులు, ప్లాస్టిక్ వ్యర్ధాలు అయితే నేమి, ఫుడ్ ప్యాకెట్లు, కూల్ డ్రింక్స్, మత్తు పానీయాల, వ్యర్ధాలు, అసాంఘిక కార్యక్రమాలు, వ్యర్ధాలతో, విచక్షణా రాహిత్యంగా వాడటం పట్ల ప్రకృతి ప్రేమికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.ఈ మైదానాన్ని విద్యార్థుల అవసరాలకు మాత్రమే ఉపయోగించాలని, పలువురు విద్యావేత్తల అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు, ప్రభుత్వ కార్యకలాపాలకు వాడుకున్నప్పటికీ ఎప్పటికప్పుడు వ్యర్ధాలను తొలగించి, మైదానంలో కనీస సౌకర్యాలు ఉండే విధంగా, పట్టణ పురపాలక సంస్థ చర్యలు తీసుకోవాలని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

