అగ్నిధారన్యూస్(రామగిరి మండలం)

పెద్దపల్లి జిల్లా రామగుండం ఆర్జీ 3 పరిధిలోని ఏఎల్పి గని ఆవరణలో హెచ్ఎంఎస్ విడుదల చేసిన బహిరంగ లేఖ కలకలం సృష్టిస్తోంది. కొద్దిరోజుల క్రితం భద్రత వారోత్సవాలు జరుపుతున్న నేపథ్యంలో ఈ లేఖ విడుదలవడం కార్మికుల రక్షణకు సంబంధించిన విషయం కావడంతో కార్మికులు భయభ్రాంతులకు గురవుతున్నారు. సాధారణంగా కార్మికుల సమస్యలపై యూనియన్ నాయకులు అధికారులకు వినతి పత్రాలు ఇస్తారు.ఇందుకు భిన్నంగా  బహిరంగ లేఖ పోస్టర్లను విడుదల చేస్తూ గని ఆవరణలో ఉన్న మాన్వే వద్ద గోడకు అంటించారు. ఈ లేఖలోని సారాంశం ఏ ఎల్ పి గనిలోని 91 లెవెల్ లోని ఏఎం 100 వర్కింగ్ ప్లేస్ లో కనీస సౌకర్యాలులేక ఫేస్ దగ్గర పనిచేస్తున్న కార్మికులకు అక్కడ ప్రమాద బారిన పడి దూరంగా వెళ్లడానికి కూడా వీలు లేకుండా నడుముల వంట మల్వతో కూడిన బురద ఉంది.అలాంటి ప్రమాదకర ప్రదేశంలో పని చేయించుకుంటూ కార్మికుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న యాజమాన్యం భద్రత చర్యలు తీసుకోకపోవడం చాలా బాధాకరం,ఈ చర్యను హెచ్ఎంఎస్ యూనియన్ నాయకులు తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు.