అగ్నిధారన్యూస్ సుల్తానాబాద్

సోమవారం రోజు సుల్తానాబాద్ పట్టణంలో   పలు కిరాణా షాపులలో రెవెన్యూ అధికారులు  ఆకస్మిక దాడులు నిర్వహించి, రెండు కిరాణా షాపులలో నిలువ ఉంచిన రేషన్ బియ్యాన్ని  పట్టుకున్నారు. వివరాల్లోకి వెళితే సుల్తానాబాద్ పట్టణంలోని మణికంఠ, అర్చన దుకాణాలలో ఎనిమిది క్వింటాళ్ల పదిహేను కిలోల రేషన్ బియ్యాన్ని అక్రమంగా నిలువ చేశారని, ఈ బియ్యాన్ని అధిక రేటుకు విక్రయిస్తూ  వ్యాపారం నిర్వహిస్తున్నారని అధికారులు పేర్కొన్నారు. రేషన్ బియ్యం పక్కదారి పట్టిస్తే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని అధికారులు హెచ్చరించారు. ఈ దాడులలో తహసిల్దార్ మధుసూదన్ రెడ్డి తో పాటు RI లు శ్రీవాణి,స్వాతి  పాల్గొన్నారు.