అప్పన్నపేట డైరెక్టర్లు పెద్ద బొంకూర్ టర్నింగ్ లో ప్రత్యక్షం.
ఒక్కొక్క డైరెక్టర్ 30 నుంచి లక్ష రూపాయల డిమాండ్.
ఆసక్తి రేపుతున్న క్యాంపు రాజకీయాలు.
అగ్నిధారన్యూస్ ( పెద్దపల్లి)
పెద్దపల్లి జిల్లా పెద్దపల్లి మండలం అప్పన్నపేట పరిధిలోని ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం,చైర్మన్ గా పనిచేసిన దాసరి చంద్రారెడ్డి పై గతంలో డైరెక్టర్లు అవిశ్వాస తీర్మానం పెట్టారు. సోమవారం రోజు అవిశ్వాసం నెగడంతో దాసరి చంద్ర రెడ్డి పదవి కోల్పోయారు. చైర్మన్ పదవికి ఆరే తిరుపతి, చింతపండు సంపత్ పోటీ పడడంతో సభ్యుల డిమాండ్ అమాంతం పెరిగింది 30 వేల నుంచి 1,00,000 డిమాండ్ చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఈ క్రమంలో ఇరువురి మధ్య సోమవారం రోజు ఘర్షణ జరిగినట్లు విశ్వాసనీయ సమాచారం. అప్పన్నపేట క్యాంపు కాస్త పెద్ద బొంకూర్ టర్నింగ్ లో ఒక ఇంటి వద్ద ప్రత్యక్షం కావడంతో ఒక్కసారిగా చర్చనీయాంశంగా మారింది. అక్కడే చైర్మన్ పదవికి సంబంధించిన చర్చలు జరుగుతున్నట్లు సమాచారం.
