చుట్టూ కార్యాలయాలు నిత్యం సందడి.
కూతవేటు దూరంలో కలెక్టరేట్.
అవేమీ పట్టించుకోని అధికారి.
అగ్నిధార కెమెరాకు చిక్కిన దృశ్యం.
అగ్నిధారన్యూస్, పెద్దపల్లి జిల్లా:
పెద్దపల్లి జిల్లా పెద్దపల్లి కేంద్రంలోని స్థానిక కలెక్టరేట్ సమీపంలో గల డివిజనల్ నీటిపారుదల శాఖ కార్యాలయంలో డి ఏ ఓ విధులు నిర్వహిస్తున్న డివిజనల్ అకౌంట్ ఆఫీసర్ చంద్రకళ, విధులు నిర్వర్తించాల్సిన సమయంలో వాటితో తనకేం సంబంధం లేదు అన్నట్టు, తన కుర్చీలో హాయిగా నిద్రపోతున్న దృశ్యాన్ని అగ్నిధార తన కెమెరాలో బంధించింది. ఆఫీసులో తన సహచర ఉద్యోగులు అందరూ విధులు నిర్వర్తిస్తున్నారనే విషయాన్ని మరిచిపోయారు. విధులుమరిచి ఆదమరిచి ఏం చక్క నిద్రపోయారు. అటుపక్క డిసిపి ఆఫీస్, పక్కనే ట్రాఫిక్ పోలీస్ స్టేషన్, కూత వేటు దూరంలో కలెక్టరేట్ , జిల్లా ఉన్నత అధికారులతో పాటు, ఆయా కార్యాలయాలకు వచ్చిపోయే ప్రజలతో నిత్యం ఆ ప్రాంతమంతా సందడిగా ఉంటుంది, అయినప్పటికీ ఆఅధికారికి అవేమీ కనిపించలేదేమో, నిద్రలోకి హాయిగా జారుకుంది. తన సహచర ఉద్యోగులు నిద్ర లేపడంతో ఒక్కసారి ఉలిక్కిపడ్డారు. విధులు నిర్వర్తించాల్సిన కార్యాలయంలో, నిద్రపోతున్న ఆ అధికారిపై ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి మరి…

