అగ్నిధారన్యూస్  హైదరాబాద్

పార్లమెంట్ ఎన్నికల కు ముందు భారత రాష్ట్ర సమితికి భారీ షాక్ తగిలింది. పెద్దపల్లి ఎంపీ బోర్ల కుంట వెంకటేష్ నేత కారు దిగి హస్తం గూటికి చేరారు. మంగళవారం ఢిల్లీలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో కేసి వేణుగోపాల్ ఎంపీ వెంకటేష్ నేతకు కండువా కప్పి కాంగ్రెస్ గూటికి ఆహ్వానించారు.  పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గంలో ఏడు అసెంబ్లీ స్థానాలు ఉండగా, ఏడు ఎమ్మెల్యే స్థానాలను మొన్న జరిగిన శాసనసభ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఎంపీ కాంగ్రెస్ పార్టీలో చేరడంతో  పార్లమెంట్ నియోజకవర్గం మొత్తం కాంగ్రెస్ కైవసం చేసుకున్నట్లు అయింది. త్వరలో పార్లమెంటు ఎన్నికలు జరగనన్న నేపథ్యంలో ఈ పరిణామం బీఆర్ఎస్ పార్టీకి బిగ్ షాక్ గా చెప్పుకోవచ్చు.