అగ్నిధారన్యూస్ సుల్తానాబాద్

సుల్తానాబాద్ మండల కేంద్రంలోని సుద్దాల గ్రామం వద్ద రోడ్డు ప్రమాదం జరగడంతో యువకుడు మృతి చెందాడు. వివరాల్లోకి వెళితే కనుకుల గ్రామానికి చెందిన బొంగోని అజయ్ వయసు 23 సంవత్సరాలు అనే వ్యక్తి కనుకుల గ్రామం నుంచి సుల్తానాబాద్ వైపు వెళుతుండగా సుద్దాల పెట్రోల్ బంకు వద్ద ఎదురుగా వస్తున్న డీసీఎం వ్యాన్ ఢీకొని అక్కడికక్కడే మృతి చెందాడు. కేసును నమోదు చేసుకొని, ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి దర్యాప్తు చేస్తున్నట్లు సుల్తానాబాద్ ఎస్సై వినిత తెలిపారు.