అగ్నిధారన్యూస్:(కల్వకుర్తి) వెల్దండ మండలం వ్యవసాయ పొలంలో,గుర్తుతెలియని అడవి జంతువు దాడిలో ఆవు దూడ మృతిచెందింది. .ఈ ఘటన నాగర్ కర్నూల్ జిల్లా వెల్దండ మండలంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన గంటల లక్ష్మయ్య అనే రైతు, సోమవారం రాత్రి తన వ్యవసాయ పొలం వద్ద దూడను కట్టేసి ఇంటికి వచ్చాడు. తిరిగి మంగళవారం ఉదయం వెళ్లి చూడగా మృత్యువాత పడి ఉంది. దూడ పై గుర్తుతెలియని అడవి జంతువు దాడి చేసి చంపినట్లు గుర్తించి.. అటవీశాఖ అధికారు లకు సమాచారం అందించారు. సమాచారం మేరకు సంఘటన స్థలానికి చేరుకొని మృతి చెందిన దూడను పరిశీలించి, పొలం చుట్టూ పక్కల తిరిగిన జంతువు పాద ముద్రలను పరిశీలించారు. చనిపోయిన దూడ విలువ సుమారుగా 18 వేల వరకు ఉంటుందనీ రైతు లక్ష్మయ్య బోరున విలపించారు. వెల్దండ మండలంలోని గ్రామాల రైతులు, తమ పొలాల వద్ద ఇనుప కంచెలను ఏర్పాటు చేసుకుని ,అందులో పశువులను, లేగ దూడలను కట్టేసుకోని ,రక్షించుకోవాలని మండల పశువైద్యాధికారి శ్యాంసుందర్ ప్రజలకు సూచించారు.
