అగ్నిధార న్యూస్,మంథిని:

ముత్తారం మండలం ఖమ్మంపల్లి గ్రామానికి చెందిన సహకార సంఘం ముత్తారం డైరెక్టర్ శ్రీ అల్లం గోవర్ధన్ గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతుండగా మంగళవారం రోజు ఆయనను కలిసి ఆరోగ్య పరిస్థితి తెలుసుకొని పాలకవర్గం సభ్యులు పరామర్శించారు. పరమార్శించిన వారిలో సింగిల్ విండో చైర్మన్ ముత్తారం & కేడీసీసి బ్యాంక్ జిల్లా డైరెక్టర్ శ్రీ గుజ్జుల రాజిరెడ్డి , సింగిల్ విండో వైస్ చైర్మన్ శ్రీ పోతిపెద్ధి రమణారెడ్డి , సీఈఓ దాసరి ప్రసాద్ , పాలక వర్గ సభ్యులు అల్గం నిర్మల పాపయ్య , శ్రీ గిరి వీరేందర్ , శ్రీ ఎలువక కొమురయ్య , శ్రీ ముడుసు ఓదెలు , సిబ్బంది జనగామ విద్యాసాగర్ ఉన్నారు