అగ్నిధారన్యూస్ సుల్తానాబాద్

సుల్తానాబాద్ మండల కేంద్రంలోని సుద్దాల గ్రామంలో మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకంలో భాగంగా పెద్దమ్మ కుంట చెరువు పూడికలలో తవ్వకాలు చేపడుతుండగా బండ కూలి బుర్ర స్వరూప కు తీవ్ర గాయాలయ్యాయి. ఆమెను హుటాహుటిన సుల్తానాబాద్ లోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించిచికిత్స అందిస్తున్నారు. సుల్తానాబాద్ ఎంపీడీవో దివ్యదర్శనరావు ఆస్పత్రికి వెళ్లి ఆమెనువివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం మెరుగైన చికిత్సను అందించాలని వైద్యులను కోరడంతో పాటు అత్యవసరమైతే కరీంనగర్ లోని ఆసుపత్రికి చికిత్స కోసం తరలిస్తామని ఆయన తెలిపారు. అలాగే బాధితురాలి కుటుంబ సభ్యులు మాట్లాడుతూ ప్రభుత్వం తమను ఆదుకోవాలని ఖర్చులు భరించాలని అధికారులను వేడుకున్నారు.