గెలుపు కాదు భారీ మెజారిటీ తేవాలి.

తెలంగాణలో కాంగ్రెస్ పవనాలు .

దేశవ్యాప్తంగా కాంగ్రెస్ గాలి ఉంది.

పార్లమెంట్ ఎన్నికల్లో మనదే మెజార్టీ ఉండాలి

దుద్దిల్ల శ్రీను బాబు.

పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వంశీకృష్ణ.

అగ్నిధారన్యూస్ మంథని//మహాదేవపూర్

పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా
మంగళవారం రోజు పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలోని మంథని నియోజకవర్గంలో గల మహ ముత్తరం మండలంలో మంత్రి శ్రీధర్ బాబు సోదరుడు దుద్దిల్ల శ్రీనుబాబు తో కలిసి పెద్దపల్లి కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి గడ్డం వంశి కృష్ణ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా…

దుద్దిల్ల శ్రీను బాబు మాట్లాడుతూ…

-పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ గెలుపునకు మంథని నియోజకవర్గంలోని నాయకులు కార్యకర్తలు కలిసికట్టుగా ప్రజల్లోకి వెళ్లి కృషి కృషి చేయాలని అన్నారు. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ పవనాలు వీస్తున్నాయన్నారు. తెలంగాణలోపార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసే కాంగ్రెస్ అభ్యర్థులను భారీ మెజా ర్టీతో గెలిపించి బీఆర్ఎస్, బీజేపీలకు బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు.-కాంగ్రెస్‌ పార్టీ పాంచ్ న్యాయ్ గ్యారంటీలను ప్రకటించందన్నారు. అందులో రైతులకు, యువకులకు, నిరుద్యోగులకు, కార్మికులకు, మహిళలకు పెద్దపీట వేసిందన్నారు.-పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గంనుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణను భారీ మెజార్టీతో గెలిపించి కాంగ్రెస్ పార్టీ సత్తా చాటాలని పిలుపునిచ్చారు.

ఎంపీ అభ్యర్థి వంశి కృష్ణ మాట్లాడుతూ…

దుద్దిల్ల శ్రీపాదరావు జీవితం స్ఫూర్తిదాయకం
-స్వర్గీయ శ్రీపాద రావు కాక వెంకటస్వామి చాలా మంచి స్నేహితులు అని అన్నారు.-మీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల, నాయకుల, ప్రజల, ఆశీర్వాదంతో నన్ను గెలిపించాలని అన్నారు.-తనకు ఒక్క అవకాశమిస్తే నియోజకవర్గ ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటానన్నారు. యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగ అవకాశాలను కల్పిస్తానన్నారు. ఈ కార్య్రమంలో కాంగ్రెస్ నాయకులు,కార్యకర్తలు ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.