నిబంధనల మేరకు వసతులు కల్పించాలి.

హస్టల్ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి.

పెద్దపల్లి జిల్లా కలెక్టర్ శ్రీ హర్ష.

అగ్నిధారన్యూస్,పెద్దపల్లి, జూన్-24:

సోమవారం రాత్రి జిల్లా కలెక్టర్ శ్రీ హర్ష పెద్దపల్లిలో ఉన్న సోషల్ వెల్ఫేర్ బాలికల సంక్షేమ హాస్టల్, రంగంపల్లిలోని బీసి బాలుర సంక్షేమ హస్టల్ ను ఆకస్మికంగా తనిఖీ చేశారు.సంక్షేమ హాస్టల్స్ ను ఆసాంతం పరిశీలించిన కలెక్టర్ హస్టల్ లో కల్పిస్తున్న సౌకర్యాల గురించి విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. సంక్షేమ హాస్టల్ లో చదువుతున్న విద్యార్థులు ఏ తరగతి చదువుతున్నారు, పాఠశాలలో తరగతులు ప్రారంభమయ్యాయా, పాఠ్య పుస్తకాలు, స్కూల్ యూనిఫామ్ అందించారా వంటి వివరాలను అడిగి తెలుసుకున్నారు.
సంక్షేమ హాస్టల్లో విద్యార్థులకు కల్పిస్తున్న సౌకర్యాలు, భోజన వివరాలను విద్యార్దుల నుంచి తెలుసుకున్నారు. హస్టల్ లో అందిస్తున్న ఆహారం రుచిగా, శుభ్రంగా ఉంటుందా, కోడి గుడ్డు, పండ్లు వంటి పౌష్టికాహారం అందిస్తున్నారా వివరాలను కలెక్టర్ పరిశీలించారు.
అనంతరం హాస్టల్స్ లో స్టాఫ్ టైం టేబుల్, వివరాలను, బాయ్స్ హాస్టల్ లోని టాయిలెట్స్, హాస్టల్ ప్రాంగణం, వంట చేసే ప్రాంతాలను జిల్లా కలెక్టర్ పరిశీలించారు.