పకడ్బందీగా గ్రామపంచాయతీ ముసాయిదా ఓటర్ జాబితా రూపకల్పన.
గ్రామాలలో పారిశుధ్య నిర్వహణ పట్ల అప్రమత్తంగా ఉండాలి.
ముసాయిదా ఓటర్ జాబితా రూపకల్పన అవగాహన.
పాల్గొన్న జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష.
అగ్నిధారన్యూస్,పెద్దపల్లి, ఆగస్టు-12:
పెద్దపల్లి జిల్లాలో ఉన్న గ్రామ పంచాయతీల వారీగా ముసాయిదా ఓటరు జాబితా పకడ్బందీగా రూపోందించాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష అన్నారు.సోమవారం జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష సమీకృత జిల్లా కలెక్టరేట్ లో గ్రామ పంచాయతీ ముసాయిదా ఓటర్ జాబితా రూపకల్పనపై సంబంధిత అధికారులకు నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జే.అరుణశ్రీ జెడ్పి సీఈవో నరేందర్,తో కలిసి పాల్గొన్నారు.
జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష మాట్లాడుతూ….
గ్రామ పంచాయతీ ఎన్నికలు త్వరలో నిర్వహించే అవకాశం ఉందని ,దీనికి అవసరమైన ముసాయిదా ఓటర్ జాబితా గ్రామాల వారీగా రూపొందించి ఆన్ లైన్ లో నమోదు చేయాలని కలెక్టర్ సూచించారు.
పార్లమెంట్ ఎన్నికల ఓటర్ జాబితా ప్రకారం గ్రామాలలో పోలింగ్ కేంద్రాల వారిగా ఓటర్ జాబితా సవరణకు చర్యలు తీసుకోవాలని, 18 సంవత్సరాల నిండిన అర్హులైన నూతన ఓటర్లను నమోదు చేయాలని, గ్రామాల్లో బూత్ స్థాయి అధికారులు ఇంటింటి సర్వే నిర్వహించి ముసాయిదా ఓటర్ జాబితా పకడ్బందీగా సిద్ధం చేయాలని కలెక్టర్ సూచించారు.
పారిశుద్ధ్యం పై దృష్టి పెట్టాలి
గ్రామాలలో పారిశుధ్య నిర్వహణ పట్ల అధికారులు అప్రమత్తంగా ఉండాలని, వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో సీజనల్ వ్యాధుల వ్యాప్తి నియంత్రణ కృషి చేయాలని అన్నారు. గ్రామాలలో వన మహోత్సవం కింద నిర్దేశించిన మొక్కల లక్ష్యం పూర్తి చేయాలని, మొక్కల సంరక్షణకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు.
ఈ సమావేశంలో జిల్లా పంచాయతీ అధికారి ఆశాలత, రజాక్ డి.పి. యం.ఈ పంచాయితీ,డివిజినల్ పంచాయతీ అధికారులు ఎంపీడీవోలు ,మండల పంచాయతీ అధికారులు, పంచాయతీ కార్యదర్శుల, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.


