అగ్నిధారన్యూస్ మంథని
రామగుండం కమిషనరేట్ పరిధిలోని ముత్తారం మండలం, ఖమ్మం పల్లి గ్రామానికి చెందిన బుద్ధ రమేష్ అను నతడు ప్రభుత్వ వైద్య ఆరోగ్యశాఖ విధించిన నిబంధనలను ఉల్లంఘించి సర్టిఫికెట్స్ లేకుండా ఏలాంటి అనుమతులు లేకుండా గ్రామంలో ఆర్ఎంపీగా చలామణి అవుతూ ప్రజలకు చికిత్సలు చేస్తున్నాడు. తాను ఎలాంటి అనుమతులు లేకుండా ఇంజక్షన్లు, గ్లూకోజ్ లు పెడుతున్నాడు. అలా పెట్టడం వల్ల మనిషి ప్రాణాలకు ప్రమాదామని తెలిసికూడా ఆర్ఎంపీ గా గ్రామంలో చలామణి అవుతున్నాడు. అలాగే తేదీ 12 ఆగస్టు 2024 రోజున సాయంత్రం 6:30 గంటల సమయంలో రంగయ్యపల్లి H/O ఖమ్మం పల్లి గ్రామానికి చెందిన సోమిశెట్టి నారాయణ తన కూతురుకు ఆరోగ్యం బాగాలేదని కాళ్లు, చేతులు గుంజుతున్నాయని తెలుపగా బుద్ధ రమేష్ వాళ్ళింటికి వెళ్లి ప్రథమ చికిత్స చేయకుండా ఇంజక్షన్ వేసి, గ్లూకోస్ పెట్టడంతో అది వికటించి బిపి తక్కువై, పల్స్ ఎక్కువ అవ్వడంతో ఆమె సీరియస్ గా ఉండడంతో కరీంనగర్, హైదరాబాద్ లో చికిత్స తీసుకున్నా కూడా తగ్గకుండా ఆమె చికిత్స పొందుతూ తేదీ: 14 ఆగస్టు 2024 రోజున ఉదయం సుమారు 11 గంటల సమయంలో ప్రసన్న చనిపోయినది. దాంతో మృతురాలి తండ్రి నారాయణ బుద్ధ రమేష్ పై ఫిర్యాదు చేయగా బుద్ధ రమేష్ ను సిఐ మంథని బి రాజు అరెస్టు చేసి రిమాండ్ కు తరలించినారు. అదేవిధంగా ముత్తారం రామగిరి మంథని మండలాల ఆర్ఎంపీలకు మంథని సీఐ రాజు పలు సూచనలు చేశారు ఆర్ఎంపీల దగ్గరికి వచ్చిన పేషెంట్లకు ప్రథమ చికిత్స మాత్రమే చేయాలన్నారు ప్రిస్క్రిప్షన్ వ్రాయడం గాని ల్యాబ్ టెస్ట్ లు రాయడం గానీ చేయరాదన్నారు .ఐవీ ఫ్లూయిడ్స్ ఇవ్వడం యాంటీబయాటిక్ మందులు ఇవ్వడం లాంటివి చేయరాదు అన్నారు ప్రాథమిక చికిత్స స్థాయికి మించి ఎటువంటి వైద్యం చేయరాదని సూచించారు. ప్రభుత్వ వైద్య ఆరోగ్యశాఖ విధించిన నిబంధనలు ఉల్లంఘించే ఆర్ఎంపీలపై చట్టరీత్య చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు వివిధ అనారోగ్య సమస్యలకు ప్రథమ చికిత్సలు ఏమి చేయవచ్చు అనే వాటి పైన ఆర్ఎంపీలకు సంపూర్ణమైన అవగాహన కలిగి ఉండాలన్నారు.గ్రామాలలో ఎవరైనా ఆర్ఎంపీలు గాని, పిఎంపీలు గాని ఎలాంటి అనుమతులు కానీ, సర్టిఫికెట్లు కానీ లేకుండా ప్రజలకు ప్రథమ చికిత్స కాకుండా తమ సొంతంగా గ్లూకోజ్ గాని ఇంజక్షన్ అని వేయరాదు అలా వేసినట్లయితే వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోబడతాయన్నారు.
