నిందితులను కఠినంగా శిక్షించాలి.
రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించాలి.
ఇలాంటి సంఘటనలు పునరుద్ధం కాకుండా చూడాలి.
మాకు కుటుంబాలు ఉన్నాయి ఆత్మ అభిమానం ఉంది.
మేము దేవుళ్లం కాదు మనుషులమే.
ఐఎంఏ రాష్ట్ర అధ్యక్షులు పగడాల కాళీ ప్రసాద్ రావు.
అగ్నిధారన్యూస్ పెద్దపల్లి
గురువారం రోజు పెద్దపల్లి జిల్లా కేంద్రంలోనీ హాస్పిటల్ ధ్వంసం, డాక్టర్ పై హత్యయత్నానికి పాల్పడిన వ్యక్తిని కఠినంగా శిక్షించాలంటూ, పెద్దపల్లి జిల్లా ఐఎంఏ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు రమాకాంత్ ఆధ్వర్యంలో, జిల్లాలోని డాక్టర్లు వందలాదిగా తరలివచ్చారు. జరిగిన సంఘటనపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని నలుమూల నుండి ఐఎంఏ సభ్యులు తరలివచ్చి ఐఎంఏ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన కార్యక్రమం చేపట్టారు.ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు పగడాల కాళీ ప్రసాదరావు మాట్లాడుతూ... వైద్య వృత్తిని దైవముగా భావించే మేము, కావాలని నిర్లక్ష్య వైఖరితో వైద్యం చేయమన్నారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో డాక్టర్ పై హత్యాయత్నానికి పాల్పడ్డ అమానవీయ సంఘటనను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. కత్తి పట్టుకుని డాక్టర్ వెంబడిస్తూ హత్యాయత్నానికి పాల్పడడం అనేది ఆటవిక చర్య అన్నారు. ప్రాణాలు పోసే మాకు, ప్రాణాలు తీస్తామంటూ వెంటపడి చంపాలనుకోవడం సభ్య సమాజంలో సిగ్గుచేటు అన్నారు. మా ప్రాణాలకు రక్షణ ఏదంటూ ప్రశ్నించారు. మేము దేవుళ్ళం కాదు వైద్యులo మాత్రమే అన్నారు.మాకు ఆత్మాభిమానం, కుటుంబం ఉంటుంది అన్నారు. జగిత్యాల జిల్లాలో డాక్టర్ పైన పెట్రోల్ పోసిన సంఘటన మరువకముందే పెద్దపల్లిలో ఏకంగా కత్తి పట్టుకొని చంపడానికి ప్రయత్నించిన దుశ్చర్యను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ సంఘటనపై వెంటనే స్పందించాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం స్పందించినట్లయితే, కేంద్ర ప్రభుత్వాన్ని ఆశ్రయిస్తామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టి దోశలను చట్టపరంగా, కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. అనంతరం ఐఎంఏ కార్యాలయం నుండి ర్యాలీగా, నిరసన తెలుపుతూ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ హాస్పిటల్ వరకు వచ్చారు. అనంతరం రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో, జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం ఇవ్వడానికి బయలుదేరారు. ఈ నిరసన కార్యక్రమంలో డాక్టర్ మల్లేశం, డాక్టర్ వెంకటేశ్వరరావు, డాక్టర్ లక్ష్మణరావు, డాక్టర్ కిరణ్ కుమార్, డాక్టర్ ప్రణీత్, తో పటు పలువురు పాల్గొన్నారు.



