రోడ్డుపై పరుగులు తీసిన డాక్టర్.
జిల్లా వ్యాప్తంగా వైద్య సేవలు బందు.
రేపు చలో పెద్దపల్లికి రాష్ట్ర ఐఎంఏ పిలుపు.
అగ్నిధారన్యూస్ పెద్దపల్లి
పెద్దపల్లిజిల్లా కేంద్రంలో గురువారం సాయంత్రం సిద్ధార్థ హాస్పిటల్ పైన దాడి ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నామని పెద్దపల్లి జిల్లా ఐఎంఏ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ అధ్యక్షులు రమకాంత్ ఆధ్వర్యంలో పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్షకు వినతి పత్రం ఇచ్చిన అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ…. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని సిద్ధార్థ పిల్లల హాస్పిటల్ పైన జరిగిన దాడి హేయమైన చర్య భావిస్తున్నామన్నారు. డాక్టర్ కొక్కుల రాజేష్ పైన కత్తితో దాడి చేయడం వల్ల తీవ్ర గాయాలపాలు కావడం జరిగింది అన్నారు. అందుకు నిరసనగా ఈరోజు నుండి వైద్య సేవలు నిలుపువేస్తున్నామన్నారు. రేపు రాష్ట్ర ఐఎంఏ ఆధ్వర్యంలోజరిగిన సంఘటనకు నిరసనగా చలో పెద్దపల్లి కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. ఇలాంటి సంఘటన పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని డాక్టర్లు డిమాండ్ చేశారు. జరిగిన సంఘటన పైన ప్రజలందరూ ఖండించాలని విజ్ఞప్తి చేశారు.
