అగ్నిధారన్యూస్ పెద్దపల్లి
పెద్దపల్లి మున్సిపల్ 10వ వార్డు పరిధిలోని రంగంపల్లికి చెందిన జంపయ్య ఇటీవల ఎల్లమ్మ గుండమ్మ,చెరువులో మృతి చెందిన విషయం తెలిసిందే. పెద్దపల్లి పట్టణంలోని జిల్లా పరిషత్ బాలుర హైస్కూల్లో 2003 జంపయ్యతో కలిసి చదువుకున్న తోటి విద్యార్థులు బుధవారం రోజు అతని కుటుంబానికి ఆర్థిక సహాయం అందించి ఉదారతను చాటుకున్నారు. మృతుని కుటుంబ సభ్యులను ఓదార్చి ధైర్యం చెప్పారు. తమతో కలిసి చదువుకున్న చిన్ననాటి మిత్రుడు జంపయ్య ఆకాల మరణం పట్ల విచారం వ్యక్తం చేశారు. జంపయ్య కుటుంబానికి 10 వేల 600 రూపాయల ఆర్థిక సాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో పదవ తరగతి వరకు కలిసి చదువుకున్న పాల్గొన్నారు.
