మిర్జంపేట పంచాయతీ కార్యదర్శి శ్రీనివాస్, సస్పెన్షన్

ఉత్తర్వులు జారీచేసిన జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష.

అగ్నిధారన్యూస్,పెద్దపల్లి, అక్టోబర్ -29:

శ్రీరాంపూర్ మండలం మిర్జంపేట గ్రామంలో పంచాయతీ కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్న బి.శ్రీనివాస్ ను సస్పెండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు.శ్రీరాంపూర్ మండలం మిర్జంపేట గ్రామంలో పంచాయతీ కార్యదర్శిగా పనిచేస్తున్న బి. శ్రీనివాస్ అధికారులకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా  విధులకు గైర్హాజరు కావడం, అనుమతి లేకుండా సెలవు పై వెళ్లడం గమనించి పై పంచాయతీ రాజ్ శాఖ అధికారులు పలుమార్లు మెమోలు జారీ చేశారని కలెక్టర్ తన ఉత్తర్వుల్లో తెలిపారు. ఉన్నతాధికారులు పలుమార్లు అందించిన సూచనలు ఆదేశాలను పట్టించుకోకుండా , విధులలో చేరమని అక్టోబర్ 26న చివరి అవకాశం ఇచ్చినప్పటికీ విధులలో చేరకపోవడం కారణంగా  పంచాయతీ కార్యదర్శిని విధుల నుంచి సస్పెండ్ చేస్తున్నామని కలెక్టర్ ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.