ఆరోగ్యంపై అవగాహన కలిగి ఉండాలి
జిల్లా వైద్యఆరోగ్య శాఖ అధికారి డాక్టర్: అన్న ప్రసన్న కుమారి
అగ్నిధారన్యూస్ పెద్దపల్లి
శుక్రవారం రోజు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో ప్రపంచ ఆంటి మైక్రోబియల్ నిరోధకత అనే అంశం పైన మీడియా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ అన్న ప్రసన్న కుమారి, మాట్లడుతూ….
ప్రపంచ ఆంటి మైక్రోబియల్ నిరోధకత వారోత్సవాలు నవంబర్ 18 నుండి 24 వరకు నిర్వహిస్తూ ప్రజల్లో అవగాహాన కార్యక్రమo చేపట్టమన్నారు. ఆంటి – మైక్రోబియల్ నిరోధకత సూక్ష్మజీవులు (బాక్టీరియా, వైరసులు, ఫంగస్, పరాన్న జీవులు) ఇన్ఫేక్షన్లను నయం చేయడానికి ఉపయోగించే మందులకు నిరోధకతను పెంచుకోవడాన్ని ఆంటి – మైక్రోబియల్ నిరోధకత అని అంటారు అని తెలిపారు.బ్యాక్టీరియల్ రిసిస్టేన్స్ ( టి.బి.)
వైరల్ రెసిస్టేన్స్ (హెచ్. ఐ.వి., ఇన్ ఫ్లూయెంజా)
ఫంగల్ రెసిస్టెన్స్ (క్యాండికా) పరాన్న జీవుల నిరోధకత ( మలేరియా) అని అన్నారు.ఈ నిరోధకతకు కారణాలు ఆంటి బయాటిక్స్ ఎక్కువగా వినియోగించడం సరిపడిన మోతాదు వాడకపోవడం చికిత్స పూర్తికాలం వాడకపోవడం,నూతన ఆంటిబయాటిక్స్ లను అభివృద్ది చేయకపోవడం,వైరల్ వ్యాదులకు అంటి బయాటిక్స్ వాడడం,ఇన్‌ఫేక్షన్ సోకకుండా జాగ్రత్తలు తీసుకోకపోవడం
వ్యాధి నిరోధక టీకాలను వేయించుకోకపోవడం కారణమన్నారు. ఆంటి మైక్రోబియల్ నిరోధకత ఏర్పడకుండా తీసుకోవలసిన జాగ్రత్తలు (నివారణ నియంత్రణ)ఇన్ ఫేక్షన్ లు సోకకుండా చేతులను పరిశుభ్రంగా కడుక్కొనుట సబ్బుతో నీటితో చేతులను ఈ క్రింది కార్యక్రమములలో ప్రతిసారి శుభ్రపరచుకోవాలి అన్నారు.వ్యాధి నిరోధక టీకాలను వేయించుకోవడం, అవసరం లేనప్పుడు ఆంటి బయోటిక్స్ వాడవద్దు అన్నారు.డాక్టర్ సలహా మేరకు మాత్రమే ఆంటి బయాటిక్స్ వాడాలి అని తెలిపారు. డాక్టర్ సూచించిన పూర్తికాలం ఆంటి బయోటిక్స్ వాడాలి,పాత ప్రిస్ర్కిప్షన్ ను ఉపయోగించవద్దు తగిన మోతాదు మాత్రమే వాడాలి.
ప్రత్యమ్నాయంగా వేరే ఆంటి బయోటిక్స్ వాడరాదు,
ఆరోగ్యాన్ని కాపాడే, రోగులను రక్షించే సూక్ష్మజీవులు మన శరీరంలో అవసరం.అనవసరంగా ఆంటి బయోటిక్స్ వాడరాదు అని సూచించారు. మంచి పోషక ఆహారాలు తీసుకోని రోగనిరోధకతను పెంచుకోవాలి అన్నారు. మీడియా సమావేశంలో వైద్య సిబ్బంది వెంకటేశ్వర్లు, రాజేష్ తదితరులు పాల్గొన్నారు.

