సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి సహకారంతో…
తల్లిదండ్రుల త్యాగాలకు కృతజ్ఞతలు తెలిపే గొప్ప కార్యక్రమం పాద పూజ
ఐక్యత పౌండేషన్ గౌరవధ్యక్షులు సుంకిరెడ్డి సుభాషిని కృష్ణారెడ్డి
అగ్నిధారన్యూస్ (కల్వకుర్తి)
కల్వకుర్తి పట్టణంలోని సరస్వతి శిశుమందిర్ ఉన్నత పాఠశాలలో గత 20 రోజులుగా ఐక్యత ఫౌండేషన్ చైర్మన్ సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి సహకారంతో
వందేమాతరం ఫౌండేషన్, శృతిలయ కల్చరర్ అకాడమి వారు సంయుక్తంగా నిర్వహిస్తున్న వేసవి శిక్షణ శిబిరంలో బాగంగా నిర్వహించిన తల్లిదండ్రుల పాద పూజ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన ఫౌండేషన్ గౌరవ అధ్యక్షులు సుంకిరెడ్డి సుభాషిణి కృష్ణారెడ్డి ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ,మనల్ని కని పెంచిన దేవుళ్ళు తల్లిదండ్రులు వారిని సేవలను,త్యాగాలను పిల్లలకు తెలియజేస్తు,కృతజ్ఞతలు తెలుపుకునే గొప్ప కార్యక్రమం తల్లిదండ్రుల పాదపూజ, ఇలాంటి మంచి కార్యక్రమాలకు ఐక్యత ఫౌండేషన్ ఛైర్మన్ సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని, పిల్లలకు విద్యా బుద్ధులతో పాటు,సమాజం పట్ల అవగాహన,కుటుంబం పట్ల బాధ్యతలను తెలియజేసే ఇలాంటి వేసవి శిక్షణ శిబిరాలు చాలా అవసరం అని ఇలాంటి కార్యక్రమాలను నిర్వహిస్తున్న వందేమాతరం,శృతిలయ కల్చరర్ అకాడమి వారికి కృతజ్ఞతలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో,వందేమాతరం ఫౌండేషన్ ప్రధాన కార్యదర్శి ఎడ్మ మాధవరెడ్డి ,శృతిలయ కల్చరర్ అకాడమి చిత్తరంజన్ దాస్,మై విలేజ్ మోడల్ విలేజ్ ఫౌండేషన్ చింతల నితిన్ గౌడ్,ఆచార్య రమేష్ గురూజీ, శిశుమందిర్ ఉపాధ్యాయులు రాజు, మహేశ్వరం ప్రధానోపాధ్యాయులు శంకరయ్య,ఐక్యత ఫౌండేషన్ సభ్యులు శేఖర్,శ్రీపతి,రవి యాదవ్,అభినవ్ రెడ్డి,శ్రీను లతో పాటు తదితరులు పాల్గొన్నారు.
