oplus_0

కలెక్టర్ కు వినతి పత్రం ఇస్తున్న ఎమ్మార్పీఎస్ నాయకులు.     

అగ్నిధారన్యూస్,పెద్దపల్లి, మే 12: అర్జీల పరిష్కారం సత్వరమే చేయాలని, ప్రజావాణి దరఖాస్తులకు అత్యంత ప్రాధాన్యతనిచ్చి అర్జీలను పెండింగ్ లో ఉంచకుండా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష సంబంధిత  అధికారులను ఆదేశించారు.

సోమవారం ప్రజావాణి కార్యక్రమం సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష సమీకృత జిల్లా కలెక్టరేట్ లో  అదనపు కలెక్టర్ డి.వేణు తో* కలిసి ప్రజల నుండి దరఖాస్తులను స్వీకరించారు. పెద్దపల్లి పట్టణం శాంతి నగర్ కు చెందిన రాజమణి చందపల్లి శివారులో గల సర్వే నెంబర్  645 లో 100 చదరపు గజాల భూమి ప్రభుత్వం తమకు కేటాయించిందని, అక్కడ ఇందిరమ్మ ఇండ్లు నిర్మించుకునేందుకు తమకు 5 లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందించాలని కోరుతూ దరఖాస్తు చేసుకోగా ఎంపిడిఓ కు రాస్తూ అవసరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ తెలిపారు.ఎలిగేడు మండలం ర్యాకల్ దేవ్ పల్లి గ్రామానికి చెందిన రాజు సర్వే నెంబర్ 113ఏ/1 లో ఉన్న ఎకరం  3 గుంటల భూమి తన తండ్రి పేరు మీద ఉందని,  తెల్ల కాగితాలపై సంతకం తీసుకొని తన తండ్రి భూమి అక్రమంగా పట్టా చేయించుకున్న వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ దరఖాస్తు చేసుకోగా తహసిల్దార్ కు రాస్తూ అవసరమైన చర్యలు తీసుకోవాలని అన్నారు. జిల్లాలో  దళితులకు కేటాయించిన ప్రభుత్వ  భూములను కొందరు ధనికులు, ఆభూములను ఎస్ సి ఎస్టీ ప్రత్యేక చట్టానికి విరుద్ధంగా కొనుగోలు చేసిన భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకోని ప్రజా ప్రయోజనాలకు ఉపయోగించాలని ఎమ్మార్పీఎస్ తాండ్ర శ్రీనివాస్, కల్వల మల్లేష్ నాయకులు కలెక్టర్ వినతి పత్రం ఇచ్చారు. ఉద్యమకారుల సమస్యలు పరిష్కరించాలి, జూన్ రెండో తేదీన తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా ప్రభుత్వం అధికారికంగా ఉద్యమకారులకు సన్మానం చేసే విధంగా చర్యలు చేపట్టాలని ఉద్యమకారుల జిల్లా అధ్యక్షులు గుండేటి ఐలయ్య కలెక్టర్ కి విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో  సంబంధిత జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.