– చాక చక్యంగా కేసును చేదించి దొంగలను పట్టుకున్న పోలీసులు
– సిబ్బందిని అభినందించిన సీఐ రాజు.
అగ్నిధారన్యూస్ మంథని :
గత ఆదివారం రోజున మంథని పట్టణానికి చెందిన ఇల్లెందుల వెంకటేశ్వర్లు పని నిమిత్తం ఇంటికి తాళం వేసి తన కుటుంబ సభ్యులతో కలిసి హైదరాబాద్ కు వెళ్లి మంగళవారం రోజున ఉదయం ఇంటికి వచ్చి చూసేసరికి ఇంటి తాళాలు పగలగొట్టి ఉండి ఇంట్లో ఉన్న టీవీ, ల్యాప్ టాప్, ట్యాబ్, వెండి వస్తువులు , 20వేల రూపాయలు దొంగలు ఎత్తుకెళ్లినారని స్థానిక పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టి , కేసు పరిశోధనలో భాగంగా సీసీ కెమెరాల ద్వారా కేసును చేదించి శనివారం మంథని పట్టణానికి చెందిన తిరునహరి రాజనర్సింహస్వామి ఆలియాస్ రాజు, తండ్రి పేరు సుధాకర్, వయస్సు 41 సం. అరెస్టు చేసి టీవీ , వెండి వస్తువులను స్వాధీన పరచుకొని రిమాండ్ కు తరలించారు. కేసును చేదించిన మంథని ఎస్ఐ డి.రమేష్ ను, రామగిరి ఏఎస్ఐ స్వామి, కానిస్టేబుళ్లు దుబాసి రమేష్, రాజ్ కుమార్, శివ, అశోక్ లను మంథని సిఐ బి.రాజు అభినందించినారు.
దొరికిన మోటార్ సైకిల్ దొంగ :
భూపాల పల్లి జిల్లా మలహార్ రావు మండలం తాడిచెర్ల గ్రామంలోని హై స్కూల్ లో హెడ్ మాస్టర్ గా విధులు నిర్వహిస్తున్న చీర్ల తిరుపతిరెడ్డి, వయస్సు 47 సం, సొంత గ్రామం కాటారం కాగా ప్రస్తుతం కరీంనగర్ నుండి తన విధులను నిర్వర్తించగా శుక్రవారం రోజున తన పాఠశాల విధులు ముగించుకొని సాయంత్రం సుమారు 5 గంటలకు మంథని పట్టణంకి వచ్చి తన స్ప్లెండర్ ప్లస్ AP15AD7688 నెంబర్ గల మోటార్ సైకిల్ ను పెద్దపల్లి మైన్ రోడ్ ప్రక్కన ఉన్నటువంటి ఇండియన్ పెట్రోల్ బంక్ వద్ద పార్క్ చేసి కరీంనగర్ వెళ్ళి పోయానని, తిరిగి శనివారం రోజున ఉదయం 9 గంటల సమయంలో వచ్చి చూడగా తన మోటార్ సైకిల్ కనిపించలేదని ఎవరో గుర్తుతెలియని వ్యక్తులు తన మోటార్ సైకిల్ ను దొంగిలించుకపోయినారని మంథని పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసిన పోలీసులు కేసు పరిశోధనలో భాగంగా ఫిర్యాదుదారిని మోటార్ సైకిల్ ను దొంగిలించిన అడవిసోమన్ పల్లి గ్రామానికి చెందిన రత్నం రాజ్ కుమార్, తండ్రి పేరు మహంకాళి, 20 సం”, నేతకానిగా గుర్తించి అరెస్ట్ చేశారు. ఈ కార్యక్రమంలో మంథని ఎస్ ఐ డి. రమేష్ పాల్గొన్నారు.

