కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు డోకూరి ప్రభాకర్ రెడ్డి
అగ్నిధారన్యూస్ (కల్వకుర్తి)
తలకొండపల్లి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు తలకొండపల్లి మండల అధ్యక్షుడు డోకూరి ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ, కేసీఆర్ మిడిమిడి జ్ఞానంతో కట్టిన ప్రాజెక్టు లపై ఆయన క్యాబినెట్ లో పని చేసిన మంత్రులు నిస్సిగ్గుగా మాట్లాడుతున్నారు.
ప్రజాధనాన్ని దోచుకోవడానికి మీరు ప్రాజెక్టు లు కట్టారు.అని ప్రజల కోసం ప్రాజెక్టు లు కడితే నాగార్జున సాగర్,శ్రీశైలం, శ్రీరామ్ సాగర్ లెక ఉంటది.కేసీఆర్ ను చూసి రేవంత్ రెడ్డి నేర్చు కోవాలని హరీష్ రావు మాట్లాడడం సిగ్గుచేటు అని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు డోకూరి ప్రభాకర్ రెడ్డి అన్నారుకేసీఆర్ కట్టిన కూలిపోయే ప్రాజెక్టుల గురించి రేవంత్ రెడ్డి నేర్చుకోవాల ప్రాజెక్ట్ లు ఎట్లా కట్టాలో కాంగ్రెస్ కు నేర్పే స్థాయి కేసీఆర్,హరీష్ కు లేదు నీ అని డోకురి ప్రభాకర్ రెడ్డి అన్నారు.
కేసీఆర్ జల దోపిడీ చేసిండు రాష్ట్రం దివాళా తీయడానికి కేసీఆర్ కారణం అని తెలంగాణను నట్టింట ముంచిన నయవంచకుడిగా కేసీఆర్ ను చూడాలి అన్నారు. ఉద్యమ కారులమని చెప్పి ఉద్యమ కారులను,ప్రజలను నిలువునా, దోపిడీ చేసిన దొంగలుగా మీరు ఈరోజు ఇంట్లో కూర్చున్నారు.మీరు ఎట్లా మోసం చేశారో చెప్పే దమ్ము, ధైర్యం మాకుంది.మా ముందు మాట్లాడే దమ్ము, ధైర్యం కేసీఆర్ కు,హారీష్ రావుకు,కేటిఆర్ కు ఉందా. అన్నారు.తెలంగాణ ను ఆర్థిక, సామాజిక, పరిస్థితులలో భాగస్వామ్యాన్ని పెంచే భాద్యత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తీసుకుంటది.అని కాంగ్రెస్ పార్టీని విమర్శించే హక్కు మీకు లేదు అన్నారు.
