ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి కొత్త ఆనవాయితీ తీసుకొస్తే చూస్తూ ఊరుకోం.

ప్రభుత్వ అధికారులు రూల్స్ పాటించకపోతే కఠిన చర్యలు తప్పవు.

బిఆర్ఎస్ పార్టీ దళిత నాయకుల హెచ్చరిక.

అగ్నిధారన్యూస్ (కల్వకుర్తి) ఆమనగల్లు మార్కెట్ యార్డ్ ఆవరణలో శుక్రవారం వ్యవసాయ మార్కెటింగ్ శాఖ ఆధ్వర్యంలో 8 కమర్షియల్ దుకాణ సముదాయాలను అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి మార్కెట్ కమిటీ చైర్ పర్సన్, మార్కెట్ కమిటీ కార్యదర్శి శ్రీనివాస్ రెడ్డిలు ఏకపక్షంగా వ్యవహరిస్తూ ప్రోటోకాల్ కు విరుద్ధంగా. ప్రోటోకాల్ లేని వ్యక్తులతో ప్రారంభోత్సవాలు చేయడం సమంజసం కాదని.. ఆమనగల్లు సింగల్ విండో చైర్మన్ గంప వెంకటేష్ గుప్తాకు ఆహ్వానించకుండా అవమానపరచడం పై బిఆర్ఎస్ నాయకులు కడ్తాల జివిజి అధ్యక్షులు సిద్ది గారి సురేష్,  కంబాలపల్లి శ్రీకాంత్ లు మండిపడ్డారు. శనివారం వారు కడ్తాల మండల కేంద్రంలోని బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఓ పత్రిక ప్రకటన విడుదల చేశారు. ప్రభుత్వ అధికారులు అధికారిక కార్యక్రమాలలో ప్రోటోకాల్ తప్పనిసరిగా పాటించాలని ప్రోటోకాల్ పాటించకుండా ఏకపక్షంగా వ్యవహరిస్తే మునుముందు కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు. కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ చెప్పినట్టు అధికారులు నడుచుకోవడం ప్రజాస్వామ్యంలో మంచి పద్ధతి కాదని వారన్నారు. ఆమనగల్ సింగల్ విండో చైర్మన్  గంప వెంకటేష్ గుప్తాను కార్యక్రమానికి ఆహ్వానించకుండా ప్రోటోకాల్ ప్రకారం శిలాఫలకంలో పేరు లేకుండా చేయడం చూస్తుంటే కావాలనే ఇదంతా కాంగ్రెస్ పార్టీ నాయకులు చేసిన కుట్రగా భావించాల్సి వస్తుందని ఇలాంటి సంఘటనలు పునరావృత్తమైతే చూస్తూ ఊరుకోమని వారు హెచ్చరించారు. ప్రభుత్వ అధికారిక కార్యక్రమాలు కల్వకుర్తి ఎమ్మెల్యే అధ్యక్షతన  జరిగితే ప్రతిపక్ష పార్టీలకు చెందిన రైతులతో ఎన్నుకోబడ్డ ప్రజాప్రతినిధులను ఆహ్వానించకుండా  అవమానపరచడం ఎమ్మెల్యే విజ్ఞతకు వది లేస్తున్నామన్నారు. ప్రభుత్వ కార్యక్రమం ఏది జరిగిన ప్రోటోకాల్ లో లేని వ్యక్తులు ప్రారంభోత్సవాలు చేయడం సభ వేదికపై కూర్చోవడం జరుగుతుందని ఈ విషయమై జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి కి ప్రోటోకాల్ అధికారులకు  ఫిర్యాదు చేయనున్నట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో, నాయకులు పోతుగళ్ల మహేష్, ఒగ్గు మహేష్, నింగారి కిషన్ తదితరులు పాల్గొన్నారు.