Oplus_131072

అగ్నిధారన్యూస్ సుల్తానాబాద్ 

ప్రాణాపాయ స్థితిలో గర్భిణీ మహిళకు రక్తహీనత తో పాటు ఉమ్ము నీరు ఎక్కువగా పోవడంతో పలు ఇబ్బందికర పరిస్థితులలో సుల్తానాబాద్ ప్రభుత్వ ఆసుపత్రి సూపరిండెంట్ గైనకాలజిస్ట్ డాక్టర్ రమాదేవి ప్రైవేట్ కు దీటుగా ప్రభుత్వాసుపత్రిలో ప్రాణాన్ని కాపాడి నిండు గర్భిణికి చికిత్సను అందించారు. వివరాల్లోకి వెళితే.. కల్వల యశోద గర్భిణి శుక్రవారం రోజున బీపీ ఎక్కువై, అధిక రక్తహీనతతో పాటు ఎక్లామ్సియా, ఫిట్స్ వచ్చే అవకాశాలు ఉండడంతో  చికిత్సను అందించి సాధారణ స్థితికి తీసుకువచ్చి నార్మల్ డెలివరీ చేయగా ఇద్దరు మగ శిశువులు జన్మించారు. ఏడవ నెలలో పురిటి నొప్పులు రావడంతో ఆమెకు తగిన ధైర్యం చెప్పి నెలలు నిండిన తర్వాత పూర్తి చికిత్సను డాక్టర్ అందజేసింది. ఈ సందర్భంగా డాక్టర్ రమాదేవి మాట్లాడుతూ సుల్తానాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో గర్భిణీలకు మెరుగైన వైద్య చికిత్సను అందిస్తున్నామని ఆమె తెలిపారు. తనను ప్రాణాపాయ స్థితి నుంచి కాపాడి ప్రత్యేక చొరవ తీసుకొని పెద్దఆస్పత్రి పంపే అవకాశం ఉన్న ఇక్కడ వైద్యం అందించినందుకు ఆసుపత్రి బృందానికి యశోద కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.