అగ్నిధారన్యూస్ (కల్వకుర్తి)
కల్వకుర్తి మండలం లోని రఘుపతి పేట దుందుభి వాగులో తెల్కపల్లి మండలం గౌరారం గ్రామానికి చెందిన సొంటే జంగయ్య (60) అనే వృద్ధుడు మరణించడం జరిగింది. రఘుపతి పేట నుండి తెలకపల్లి కి వెళ్లే రహదారి పై దుందుభినది ప్రవహిస్తుంది. దుందుభి నది అకాల వర్షానికి ప్రవహిస్తుండడంతో నది దాటే ప్రయత్నంలో జంగయ్య మృతి చెందాడు.స్థానికులు గమనించి వృద్ధుని రక్షించడానికి ప్రయత్నం చేసినప్పటికీ అప్పటికే మృతి చెందడం జరిగింది. సమాచారం తెలుసుకున్న కుటుంబ సభ్యులు మృత దేహాన్ని చూసి రోదించారు.