అగ్నిధారన్యూస్ మంథని :

మంథని మండలం ఎక్లాస్పూర్ గ్రామానికి చెందిన దండిగ కొమురయ్య తెల్లవారు జామున 6 గంటల సుమారులో పొలం దగ్గరకు వెళ్లిన తన తండ్రి ఇంకా రావడం లేదని కొడుకు దండిగ రవి పొలం వద్దకు వెళ్లి చూసే సరికి కరెంట్ షాక్ కొట్టి పొలం లో పడి చనిపోయి ఉన్న తన తండ్రిని చూసి రవి వెంటనే తన కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చి , పోలీసులకు ఫిర్యాదు చేయటంతో ప్రమాద స్థలానికి ఏఎస్ఐ మల్లయ్య తన సిబ్బంది , విద్యుత్ అధికారులు అసిస్టెంట్ లైన్ మెన్ లు దుర్గం రవీందర్ , గౌతమ్ ,విల్లేజ్ హెల్పర్లు తిరుపతి రెడ్డి , కుర్మశెట్టి శ్రీకాంత్ లతో కలిసి వెళ్లి సంఘటన స్థలాన్ని పరిశీలించగా కరెంట్ పోలు సపోర్ట్ వైర్ కు గైడిన్స్ లెటర్ లేకపోవడంతో వర్షం కురుస్తున్న కారణంగా సపోర్ట్ వైర్ కి కరెంట్ వచ్చి కొమురయ్య ఆ వైర్ కి తాకి మృతి చెందినట్లు తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.