– కిలో మీటర్ల మేర నిలిపిన వందల లారీలు
అగ్నిధారన్యూస్ మంథని :
ఖమ్మంపల్లి – తాడిచెర్ల (పెద్దపల్లి- భూపాలపల్లి జిల్లాలు) గ్రామాల మధ్యన మానెరు వాగుపై నిర్మించిన బ్రిడ్జితో మంథని మండల కేంద్రం నుండి భూపాలపల్లి జిల్లా కి దూర ప్రయాణం తక్కువ కావడంతో పలు రకాల వాహన దారులు ఈ ఎక్లాస్పూర్, బిట్టుపల్లి గద్ధలపల్లి – రంగయ్యపల్లి గ్రామాల మీదుగా ప్రయాణం చేస్తుంటారు. ఖమ్మంపల్లి ఇసుక క్వారీ నుండి భారీ వాహనాల ద్వారా ఇసుక రవాణా జరుగుతుంటే ఈ అర్ అండ్ బీ మార్గం గుండా ప్రయాణించే ద్విచక్ర వాహనం, ఆటో, కారు , బస్సు లలో ప్రయాణించే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇసుక లోడింగ్ కొరకు వచ్చిన లారీలకు పార్కింగ్ స్థలం లేకపోవడంతో నడి రోడ్డుపై భారీ వాహనాలు పార్కింగ్ చేయటంతో వచ్చి పోయే వాహన దారులకు ఒక వైపు ఉన్న రోడ్డును మాత్రమే వినియోగిస్తూ తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పలుమార్లు ట్రాఫిక్ సమస్యల గురించి ముత్తారం మండల పోలీసులకు తెలియజేసిన ట్రాఫిక్ సమస్యల పరిష్కారం కొరకు లారీ డ్రైవర్ లతో ముత్తారం ఎస్సై మాట్లాడిన లారీ డ్రైవర్ ల తీరు మాత్రం మారటం లేదు. ఈ అర్ అండ్ బీ నడి రోడ్డుపై లారీలా పార్కింగ్ చేయకుండా చూడాలని సంబంధిత శాఖ అధికారులు వెంటనే తగు చర్యలు తీసుకోవాలని ఈ మార్గం గుండా ప్రయాణించే వాహనదారులు , బాధిత గ్రామాల ప్రజలు వాహనదారులు డిమాండ్ చేస్తున్నారు.