– గ్రామంలో పడకేసిన పారిశుద్ధం
అగ్నిధార న్యూస్ మంథని :
సిబ్బంది నిర్లక్ష్యమా లేక గ్రామాధికారి పర్యావేక్షణ సరిగా లేకపవడంతోనా..? గ్రామంలో చిన్న పాటి చినుకుకే రోడ్డుపై కుంటలా నీటి నిల్వలు దర్శనం ఇస్తున్నాయి.. పెద్దపల్లి జిల్లా మంథని మండలంలోని బిట్టుపల్లి గ్రామంలో చిన్న పాటి చినుకు పడిన వర్షపు నీరు రోడ్లపై నిలిచి ఉంటుంది. గ్రామంలో మురికి కాలువలు లేక ఇండ్లలోని వృధా నీరు కూడా రోడ్లపైకి వచ్చి నీరు నిలుస్తూ ఉంటున్నందున గ్రామ ప్రజలు నీటిలో నుండి నడవడానికి ఇబ్బందులకు గురవుతూ అనారోగ్య పాలవుతున్నారు. వర్షాకాలం మొదలై ప్రజలు సీజనల్ వ్యాధులకు గురి కాకూడదు అని ప్రభుత్వం అధికారులకు ఆదేశాలు జారీ చేసిన గ్రామ స్థాయిలో అవి ఏవి కూడా అమలవటం లేవు. వర్షాకాలం మొదలై ఇన్ని రోజులు గడిచిన గ్రామంలో ఇప్పటి వరకు దోమల నివారణకు ఫాగింగ్ చేయకుండా నిర్లక్ష్యంగా ఉండటంతో దోమల కాటుకు ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారు. ప్రజలు గ్రామంలోకి వచ్చే ప్రధాన రోడ్డుకు ఇరువైపులా పిచ్చి గడ్డి మొక్కలు బాగా ఉండటంతో రాత్రి సమయంలో విషపురుగులు ఏవి వచ్చిన ప్రమాద బారిన పడే అవకాశం పోలేదు.తక్షణమే గ్రామంలో మురికి కాలువలు ఏర్పాటు చేసి ఇండ్లలోని నీరు , వర్షపు నీరు రోడ్లపై నిలువ కుండ చూడాలని, గ్రామంలో దోమల నివారణకు ఫాగింగ్ చేపించాలంటు గ్రామ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.