జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష

అగ్నిధార న్యూస్ పెద్దపల్లి :

అర్జీల పరిష్కారం సత్వరమే చేయాలని, ప్రజావాణి దరఖాస్తులకు అత్యంత ప్రాధాన్యతనిచ్చి అర్జీలను పెండింగ్ లో ఉంచకుండా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష సంబంధిత అధికారులను ఆదేశించారు.సోమవారం ప్రజావాణి కార్యక్రమం సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష సమీకృత జిల్లా కలెక్టరేట్ లో అదనపు కలెక్టర్ డి.వేణు తో కలిసి ప్రజల నుండి దరఖాస్తులను స్వీకరించారు.ధర్మారం మండలం ఖిలావనపర్తి గ్రామానికి చెందిన ఎం.కవిత తనకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలని కోరుతూ దరఖాస్తు చేసుకోగా పిడి హౌసింగ్ కు రాస్తూ అవసరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ తెలిపారు.ముత్తారం మండలం పోతారం గ్రామానికి చెందిన గడ్డం పుష్పలత గ్రామ శివారు లోని 59వ సర్వే నెంబర్ లో ఉన్న ప్రభుత్వ భూమి తన కబ్జాలో ఉందని, తనకు పట్టా ఇప్పించాలని కోరుతూ దరఖాస్తు చేసుకోగా తహసిల్దార్ కు రాస్తూ అర్హత మేరకు పరిశీలించి అవసరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ తెలిపారు.ప్రజావాణి కార్యక్రమంలో సంబంధిత జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.