విద్యార్థులను అభినందించిన కరస్పాండెంట్ మోహనరాజా.

అగ్నిధారన్యూస్ ఎన్టిపిసి జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదివారం ఎన్టిపిసి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన పెద్దపల్లి జిల్లాస్థాయి క్రీడల పోటీలలో  ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలలో చదువుతున్న వందలాదిమంది  విద్యార్థులు పాల్గొన్నారు. జిల్లాస్థాయిలో విద్యార్థులలోని క్రీడా నైపుణ్యాలను వెలికి తీసేందుకు నిర్వహించిన  పోటీలలో,  విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. పెద్దపల్లి జిల్లా పెద్దపల్లి మండలం పెద్దకలవల లోనీ నోబెల్ ఉన్నత పాఠశాలలో ఏడవ తరగతి చదువుతున్న విద్యార్థులు ఈ పోటీలలో పాల్గొని, ఎస్ అనన్య 60 మీటర్ల పరుగు పందెం బ్యాక్ షార్ట్ పుట్ లో ద్వితీయ స్థానం, ఎండి అబ్దుల్ 60 మీటర్ల పరుగు పందెం లో ద్వితీయ స్థానం, ఎం రోహన్ పరుగు పందెంలో తృతీయ స్థానం సాధించారు. ఈ సందర్భంగా విద్యార్థులను పాఠశాల కరస్పాండెంట్ మోహనరాజ, పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు ప్రణీత, పాఠశాల క్రీడల ఉపాధ్యాయుడు సురేందర్ అభినందించారు.