మత్స్య సహకార సంఘం డిమాండ్…

అగ్నిధారన్యూస్ ఓదెల

ఓదెల గ్రామ పంచయతి బహుళ రహదారుల నిర్మాణం చేపట్టింది ఓదెల నుండి పెగడపల్లి వరకు నిర్మించే బహుళ రహదారి విస్తరణ పనులు జరుగుచున్నవి . ఈ క్రమంలో ఓదెల గ్రామపంచాయతీ పరిధిలో గల సర్వే నంబర్ 371 బై శెట్టి కుంట లో రోడ్డుకు ఇరువైపుల తీసిన వ్యర్థ డాంబరు మట్టిని వేసి పూడుస్తున్నారు. రహదారికి ఇరువైపుల మట్టి తీసి సమనంగా రోడ్ వేయకుండా అన్యాయంగ బైశెట్టి కుంటను మాత్రమే పుడుస్తున్నారు. కాంట్రాక్టర్ రాజకీయ ఒత్తిళ్లకు లొంగి రహదారి సమాన రీతిలో తీసుకు వెళ్లకుండా స్థానిక రాజకీయ నాయకుని బంధువులకు అనుకూలంగా వ్యవహరిస్తున్నాడు. కాంట్రాక్టర్ అక్రమ చర్యల వలన కుంట కింద ఉన్న రైతులకు నీటి ఎద్దడి ప్రమాదం కుంటలో ఇప్పటికే చేప పిల్లల పెంపకం కొరకు వేసిన చేప పిల్లలు చనిపోయే ప్రమాదం పొంచి ఉంది. చేపల అమ్మకం జీవనాధారం చేసుకుని అందులో ఉన్న చేపలు చనిపోవడం వలన మత్స్యకారులకు తీవ్ర నష్టం జరిగే ప్రమాదం ఉంది. ఇప్పటికే గ్రామంలోని వినాయక విగ్రహాలను నిమజ్జనం చేయడం వలన చేపల ఎదుగుదల లేకపోవడం జరుగుచున్నది. వినాయక విగ్రహాల నిమజ్జనం చేయడం వలన వినాయక సాగర్ గా పేరొందిన ఈ కుంట ను పూడ్చడం వలన మత్స్యకారులకు అన్యాయం జరగడమే కాకుండా భవిష్యత్తులో వినాయక విగ్రహాల నిమర్జనానికి అవకాశం లేకుండా పోతుంది. ఈ విషయం పై విచారణ జరిపించి త్వరితగతిన తగిన చర్యలు తీసుకుని గ్రామ ప్రజలకు రైతులకు మత్స్యకారులకు న్యాయం చేయగలరని ఓదెల మత్స్యకారుల సంఘం నాయకులు రైతులు కలిసి స్థానిక తహసిల్దార్ కు వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో
పెండం రాములు, తూడి సురేష్, పెండం ఓదెలు, తూడి ప్రవీణ్, తూడి రాజయ్య, పసెడ్ల స్వామి, పోషవేనా విజ్జిగిరి తూడి కుమారస్వామి తూడి శంకర్ మంద రాజయ్య, తీగల కొమురెళ్ళి, మంద ఆశాలు, పసెడ్ల సంపత్, గరిగంటి మహేష్, పాల్గొన్నారు.