అగ్నిధారన్యూస్ పెద్దపల్లి కలెక్టరేట్
రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన పెద్దపల్లి ప్రజావాణిలో గత సోమవారం కాల్వ శ్రీరాంపూర్ మండలం కిష్టంపేట గ్రామానికి చెందిన బండి సతీష్ అనే వ్యక్తి , ఆత్మహత్య చేసుకున్న ఘటనతో అధికారులు ఒకసారిగా ఉలికిపడ్డ సంఘటన తెలిసిందే. మళ్లీ అలాంటి సంఘటనలు పునరావృత్తం కాకుండా ఉండడానికి, ఉన్నతాధికారుల ఆదేశాలమైనది పెద్దపల్లి పట్టణ ఎస్ ఐ లక్ష్మణరావు పర్యవేక్షణలో ఈ సోమవారం ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. ప్రజావాణికి వచ్చే ఫిర్యాదు దారులను ఒక క్రమ పద్ధతిలో ఉంచుతూ ప్రజావాణి కార్యక్రమం సజావుగా సాగడానికి పెద్దపల్లి ఏ ఎస్ఐ రామస్వామి తో పాటు పోలీసు సిబ్బంది సహకరించారు.
కంపు కొడుతున్న కలెక్టరేట్…
గత సోమవారం ప్రజావాణిలో బండి సతీష్ ఆత్మహత్య చేసుకోవడానికి వినియోగించిన పురుగుల మందు కలెక్టరేట్ సమావేశ మందిరంలో వారం రోజులు గడిచిన ఇంకా పురుగుల మందు ప్రభావం పోలేదు.
