టాస్క్ చైర్మన్ తో కలిసి స్థలం పరిశీలన చేసిన సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి.

అగ్ని ధార న్యూస్ (కల్వకుర్తి)

రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి  ఐటీ శాఖా మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఆదేశాలతో నాగర్ కర్నూల్ ఎంపీ మల్లు రవి మరియు ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి చొరవతో కల్వకుర్తి పట్టణ కేంద్రంలో టాస్క్ తెలంగాణ అకాడమి ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్ ఆధ్వర్యంలో ఏర్పాటు కానున్న నూతన స్కిల్ సెంటర్ స్థల పరిశీలనకై కల్వకుర్తి పట్టణ కేంద్రంలో పర్యటించిన టాస్క్ సి.ఇ.ఓ శ్రీకాంత్ సిన్హా  టాస్క్ సి ఓ ఓ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకుడు ఐక్యత ఫౌండేషన్ చైర్మన్ సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, స్కిల్ సెంటర్ ద్వారా స్థానిక యువతకు కంప్యూటర్ శిక్షణ, టెక్నికల్ కోర్సులు, పరిశ్రమలకు సంబంధించిన ప్రత్యేకనైపుణ్య శిక్షణ ఇచ్చి,స్వయం ఉపాధి అవకాశాలకు అందించేందుకు,
ప్రభుత్వం ప్రత్యేకంగా ఈ సెంటర్ ఏర్పాటు చేయనుందని, ముఖ్యంగా కంపెనీల అవసరాలు తెలుసుకొని విద్యార్థులను శిక్షణ ఇవ్వడం జరుగు తుందని, నియోజక వర్గ గ్రామీణ ప్రాంతాల యువతకు మంచి అవకాశాలు కల్పించడమే కల్వకుర్తి లో ఏర్పాటు చేయబోయే స్కిల్ సెంటర్ యొక్క ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో.టాస్క్ రీజినల్ హెడ్ సవీన్ రెడ్డి,15వ వార్డు మాజీ కౌన్సిలర్ షానావాజ్ ఖాన్ రజియా బేగం, మరియు ఐక్యత ఫౌండేషన్ సభ్యులు జైపాల్ రెడ్డి,రచ్చ శ్రీరాములు,నరేందర్ గౌడ్, గణేష్, యాదయ్య, శ్రీపతి,శేఖర్,శ్రీను,కళ్యాణ్ తదితరులు పాల్గొన్నారు.