రేషన్ డీలర్ల సమస్యలను వెంటనే పరిష్కరించాలి.
నెల నెల కమిషన్ ఇవ్వాలి.
ఐదు నెలల కమిషన్ విడుదల చేయాలి.
మేనిఫెస్టోలో పెట్టిన హామీలను అమలు చేయాలి.
సెప్టెంబర్ 5న రాష్ట్రవ్యాప్తంగా ఒకరోజు రేషన్ షాపుల బంద్.
జిల్లా ప్రధాన కార్యదర్శి మద్దెల నరసయ్య.
పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు ఎలా బోతారం శంకర్.
అగ్నిధారన్యూస్ పెద్దపల్లి కలెక్టరేట్
రాష్ట్రవ్యాప్తంగా రేషన్ డీలర్ల సంక్షేమ సంఘం ఇచ్చిన పిలుపుమేరకు పెద్దపల్లి జిల్లాలోని రేషన్ డీలర్లు సోమవారం జిల్లా కలెక్టర్ ను కలిసి తమ డిమాండ్లపై వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఆ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మద్దెల నరసయ్య పెద్దపల్లి మండల అధ్యక్షుడు ఎలాబోతారం శంకర్ మాట్లాడుతూ… కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడక ముందు మానిఫస్టోలో పొందుపరిచిన హామీలను వెంటనే నెరవేర్చాలని, అన్నారు. ఏప్రిల్ మాసం నుండి ఆగస్టు మాసం వరకు డీలర్లకు రావలసిన కమిషన్ ఇంతవరకు ఇవ్వలేదని ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వంతో సంబంధం లేకుండా రాష్ట్ర ప్రభుత్వమే కమిషన్ ఇవ్వాలని అన్నారు. జిల్లాలో పేరుకుపోయిన దొడ్డు బియ్యం నిల్వలను వెంటనే ప్రభుత్వం తీసుకొని వాటి స్థానంలో సన్నబియ్యం కేటాయించాలి అన్నారు. రేషన్ షాపులను మినీ సూపర్ మార్కెట్ గేట్లుగా తీర్చిదిద్దాలి. హెల్త్ కార్డులు జారీ చేయాలి. బియ్యం దిగుమతి చార్జీలు ప్రభుత్వమే భరించాలి. పాత బకాయిలను వెంటనే చెల్లించాలి. కరోనా సమయంలో మరణించిన డీలర్ కుటుంబాలకు ఎక్స్గ్రేషియా చెల్లించాలి. డీలర్లకు చేసే పనిలో భద్రత కల్పించాలి. నెల నెల ఇచ్చే కోటలో బియ్యం తరుగుదల లేకుండా చూడాలి. రేషన్ దుకాణాలకు ప్రభుత్వమే అద్దె చెల్లించాలి. నెల నెల కమీషన్ ఇస్తూ అర్హులైన డీలర్లకు శాఖాపరమైన పదోన్నతులు కల్పించాలని అన్నారు. లేనియెడల సెప్టెంబర్ ఐదవ తేదీన రాష్ట్రవ్యాప్తంగా ఒక రోజు రేషన్ షాపుల బందు కార్యక్రమం నిర్వహిస్తామని ప్రభుత్వానికి హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రేషన్ డీలర్ల సంఘం జిల్లా ఉపాధ్యక్షులు జయప్రద, తిరుపతి, ప్రభంజన్ రెడ్డి, స్వామి, రాజేశం, సురేష్, రాజయ్య, రాజమౌళి, చరణ్ గౌడ్, కొమురయ్య, లింగభవాని, లింగయ్య, గాండ్ల రవి, బిక్కు నాయక్, తదితరులు పాల్గొన్నారు.