పంచాయతీ శాఖ పై సమీక్ష నిర్వహించిన జిల్లా కలెక్టర్

అగ్నిధారన్యూస్ పెద్దపల్లి 

గ్రామాలలో పారిశుధ్య నిర్వహణకు పట్టిష్ట చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష అన్నారు.మంగళవారం సమీకృత జిల్లా కలెక్టరేట్ లో పంచాయతీ శాఖ పై జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు.

సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష మాట్లాడుతూ….

గ్రామ పంచాయతీలలో చేపట్టిన అభివృద్ధి పనులను సకాలంలో పూర్తి చేయాలని అన్నారు. కోర్టు కేసులు అటెండ్ అవుతూ ప్రభుత్వానికి సానుకూలంగా తీర్పు వచ్చేలా అవసరమైన డాక్యుమెంట్ సమర్పించాలని అన్నారు.గ్రామాలలో పారిశుధ్య నిర్వహణ పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని, ప్రతి రోజూ గ్రామాల్లో పారిశుధ్య చర్యలు జరగాలని అన్నారు.గ్రామాలలో ఎక్కడ అక్రమ నిర్మాణాలు జరగకుండా పర్యవేక్షించాలని అన్నారు.గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి నిర్ణిత షెడ్యూల్ ప్రకారం ఓటర్ లిస్ట్ అప్ డేట్ చేయాలని అన్నారు.ఈ సమావేశంలో జిల్లా పంచాయతీ అధికారి వీర బుచ్చయ్య, డి.ఎల్.పి.ఓ లు, ఎంపీ ఓలు, సంబంధిత అధికారులు,తదితరులు పాల్గొన్నారు.