వలపన్ని పట్టుకున్న సీఐఎస్ఎఫ్ అధికారులు.
ముగ్గురు నిందితుల గుర్తింపు.
రెండు వాహనాలలో స్క్రాప్ తరలింపు.
టౌన్ షిప్ భవనాలకు ఉపయోగించే ఇనుముగా గుర్తింపు.
తదుపరి చర్యలకు ఎన్టిపిసి అధికారులకు అప్పగింత.
అగ్నిధారన్యూస్ ఎన్ టి పి సి క్రైమ్
గురువారం ఎన్ టి పి సి టౌన్ షిప్ నుండి ట్రాక్టర్ల ద్వారా స్క్రాప్ మెటీరియల్ తరలిస్తున్నారని విశ్వసనీయ సమాచారం మేరకు సిఐఎస్ఎఫ్ విజిలెన్స్ అధికారులు నిందితులను వలపని పట్టుకున్నారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. గురువారం రాత్రి సుమారు 18:30 గంటల ప్రాంతంలో, ఎన్ టి పి సి టౌన్‌షిప్ నుండి ట్రాక్టర్ల ద్వారా స్క్రాప్ మెటీరియల్‌ల ముగ్గురు వ్యక్తులు తరలిస్తున్నారని CISF విజిలెన్స్ అధికారులకు విశ్వసినీయ సమాచారం అందింది. వెంటనే రంగంలోకి దిగిన అధికారులు పదినిమిషాల్లోపే సుమారు 18:40 గంటల ప్రాంతంలో ఎన్ టి పి సి టౌన్‌షిప్ ప్రధాన ద్వారం సమీపంలో 03 CIW సిబ్బందితో అక్రమార్కులపై దాడి చేయడానికి ఆ ప్రాంతానికి చేరుకొని. సుమారు 20:45 గంటల ప్రాంతంలో, ఎన్ టి పి సి టౌన్‌షిప్‌లో భవన నిర్మాణానికి ఉపయోగించే ఇనుప పదార్థాలను అన్‌లోడ్ చేయడానికి NSY RSTPS ప్లాంట్ నుండి వచ్చిన AP W 2445 / AT V 3790 నెంబర్ లు కలిగిన ఒక ట్రాక్టర్ AP 15 AY 7800 నెంబర్ కలిగిన ఒక హైడ్రా వాహనం, ట్రాక్టర్ గుర్తించారు. ట్రాక్టర్ ట్రాలీ కింద హైడ్రా వాహనం లోపల సుమారు 170 కిలోల ఇనుప స్క్రాప్ మెటీరియల్‌లను దాచిపెట్టినట్లు అధికారులు తెలిసింది. దొంగతనం చేసిన స్క్రాప్ ను ఎన్ టి పి సి టౌన్‌షిప్ ప్రధాన ద్వారం పక్కన ఉన్న స్క్రాప్ దుకాణంలో విక్రయించాలనే ఉద్దేశ్యంతో నిందితులు ఉన్నారని అధికారులు గ్రహించారు. ట్రాక్టర్ , హైడ్రా స్క్రాప్ దుకాణం వద్దకు వచ్చి నిందితులు అన్‌లోడ్ చేయడానికి ప్రయత్నించిన వెంటనే, అప్పటికే వచ్చి పక్కనే పొదల చాటున మాటు వేసి ఉన్న సిబ్బంది దొంగిలించబడిన సామాగ్రితో పాటు ముగ్గురిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఎ. సతీష్ (పాస్ నం. 59732) – ట్రాక్టర్ డ్రైవర్, ఎలిని ఇంజనీరింగ్ వర్క్స్, మిస్టర్ గుడ్డు కుమార్ సింగ్ (పాస్ నం. 858206) – హైడ్రా డ్రైవర్ మిస్టర్ కబీర్ అన్సారీ (పాస్ నం. 913318) – క్రేన్ ఆపరేటర్, న్యూ టెక్ ఇంజనీరింగ్‌కు విభాగానికి చెందిన వారిగా గుర్తించారు. ఉద్దేశపూర్వకంగానే దొంగతనం చేయాలనే టౌన్‌షిప్ నుండి స్క్రాప్ వస్తువులను లోడ్ చేశారని అధికారుల విచారణలో వెల్లడైంది. ముగ్గురు నిందితులతోపాటు, రెండు వాహనాలు స్వాధీనం చేసుకున్న సామాగ్రిని తదుపరి చర్యల కోసం ఎన్టిపిసి నిర్వహణ అధికారులకు అప్పగించినట్లు సిఐఎస్ఎఫ్ అధికారులు ఒక పత్రిక ప్రకటనలో వెల్లడించారు.