అగ్నిధార న్యూస్ , మంథిని:
ఏసీబీ ట్రాప్లలో ఏఈఈ ట్రాన్స్కో మంథని రూరల్…!!
పెద్దపల్లి జిల్లాలోని మంథని మండలం బిట్టుపల్లి సబ్ స్టేషన్ లో ఏసీబీ దాడులు…!
ఆరెంద కు చెందిన షౌకత్ అలీ అనే ఓ రైతు వద్ద నుండి ట్రాన్స్ఫార్మర్స్ కొరకు 20 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ కి పట్టు బడిన విద్యుత్ ఏ ఏ ఈ రాజ్ కుమార్…!
మంథని మండలం ఆరెంద కు చెందిన షౌకత్ అలీ అనే లొంగిపోయిన మాజీ నక్సలైట్ కు ప్రభుత్వం ఇచ్చిన 5 ఎకరాల వ్యవసాయ భూమిలో ఉన్న బోరుకు విద్యుత్ కనెక్షన్ కోసం ట్రాన్స్ఫార్మర్స్ ఏర్పాటు కొరకు ఏ.ఈ.ఈ రాజ్ కుమార్ 25 వేలు డిమాండ్ చేయగా ఆయన ఏసిబి అధికారులను ఆశ్రయించగా వారి సూచన మేరకు ఈరోజు బిట్టుపల్లి సబ్ స్టేషన్లో 20 వేలు బాధితుడి వద్ద నుండి తీసుకుంటుండగా రెడ్ హ్యాడెండ్ గా ఏసీబీ అధికారులకు పట్టుబడడం జరిగింది..!ఈమేరకు కేసు నమోదు చేసుకొని ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానం లో రాజ్ కుమార్ ను హాజరు పరచనున్నారు…!!
ఎవరైనా లంచం అడిగితే కరీంనగర్ ఏసీబీ డి.ఎస్పీ కె.భద్రయ్య నెంబర్ 9440446166 లేదా టోల్ ఫ్రీ నెంబర్ 1064 ను సంప్రదించండి……!!
