అగ్నిధార న్యూస్ ,పెద్దపల్లి;
పెద్దపల్లి మండలంలో ఉన్నటువంటి అటవి భూముల వివరాలు పకడ్బందీగా సేకరించాలని పెద్దపల్లి మండల ప్రత్యేక అధికారి మైకల్ బోస్ అన్నారు. పెద్దపెల్లి మండల పరిషత్ కార్యాలయ సమావేశ మందిరంలో శనివారం సర్పంచ్, ఎంపీటీసీ, కార్యదర్శిలతో ప్రత్యేకసమావేశం ఏర్పాటుచేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోడు భూములు ఆక్రమణకు గురికాకుండా గ్రామ సభలలో తీర్మానం చేయాలని అన్నారు. పోడు భూముల సమస్యలను పరిష్కరిస్తూనే అటవి భూములు అన్యాక్రాంతం కాకుండా చూడాలి అన్నారు. కార్మిక శాఖ అధికారి రాజలింగం మాట్లాడుతూ అటవీ భూములు సాగుచేస్తున్న పేదలకు నష్టం జరగకుండా వారి నుండి దరఖాస్తులు స్వీకరించాలని అన్నారు. నవంబర్ 8 రోజున గ్రామసభ నిర్వహించి అటవీ హక్కుల కమిటీ ఏర్పాటు చేయాలని సూచించారు.ఈ కమిటీల్లో అటవీ భూములు సాగు చేసే వారు లేకుండా చూడాలని అన్నారు. మండల అభివృద్ధి అధికారి రాజు మాట్లాడుతూ గ్రామస్థాయిలో వేయబోయే కమిటీలలొ ఎస్టీలు,ఎస్సిలు, ప్రజా ప్రతినిధులు, మహిళలు ఉండే విధంగా చూడాలన్నారు . అటవీ భూములను గుర్తించి వాటి హద్దులు నిర్ణయించాలని సూచించారు. ఈసందర్భంగా బొంపల్లి సబ్బితం సర్పంచులు వారి గ్రామంలో ఉన్న అటవీ భూమి సమస్యను అధికారుల దృష్టికి తీసుకువచ్చారు ఈకార్యక్రమంలో , ఎంపీవో ,ఫారెస్ట్ అధికారులు ,సర్పంచులు ,ఎంపీటీసీలు పంచాయతీ కార్యదర్శులు ,తదితరులు పాల్గొన్నారు.
